ఇండియాలో ఉబర్‌ కొత్త సర్వీస్.. ఇక నచ్చినట్లు బుక్ చేసుకోవచ్చు..

ఈ సర్వీస్ ద్వారా ప్రయాణికులు ఒక ఆటోను  డ్రైవర్‌తో  సహ కొన్ని గంటలవరకు గంటలు బుక్ చేసుకోవచ్చు అలాగే మీ ప్రయాణంలో మల్టీ స్టాప్స్  అనుమతిస్తుంది. ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులు కనీసం ఒక గంట పాటు లేదా 10 కిలోమీటర్ల వరకు ఆటో బుక్ చేసుకోవచ్చు.

cab service Uber Launches 24x7 Auto Rentals in India

క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్ బుధవారం భారతదేశంలో ఆన్-డిమాండ్ 24x7 ఆటో రెంటల్ సేవలను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా ప్రయాణికులు ఒక ఆటోను  డ్రైవర్‌తో  సహ కొన్ని గంటలవరకు గంటలు బుక్ చేసుకోవచ్చు అలాగే మీ ప్రయాణంలో మల్టీ స్టాప్స్  అనుమతిస్తుంది.

ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులు కనీసం ఒక గంట పాటు లేదా 10 కిలోమీటర్ల వరకు ఆటో బుక్ చేసుకోవచ్చు. కొన్ని గంటల ప్యాకేజీలను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఉబెర్ ఆటో రెంటల్ సర్వీస్ కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ సర్వీస్ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, ఢీల్లీ-ఎన్‌సిఆర్, హైదరాబాద్, ముంబై, పూణేలలో ఉంది. గంటకు లేదా 10 కిలోమీటర్లకు రూ.169 వసూలు చేస్తామని ఉబర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గరిష్ఠంగా 8 గంటలు వాడుకోవచ్చన్నది.

also read రిఫ్రెష్ లుక్స్, ప్రీమియం స్టైలింగ్ తో సరికొత్త హోండా జాజ్.. ...

మీరు ఆటో రెంటల్ బుక్ చేయడానికి ముందు ఉబెర్ యాప్ లో పాపప్ అయ్యే కొన్ని నిబంధనలు, షరతులు కూడా ఉన్నాయి. ఆటో బుక్ చేసుకున్నాక ట్రిప్ ప్రారంభమైన తర్వాత మీరు ఎంచుకున్న ప్యాకేజీని మార్చలేరు.

అదనపు సమయం లేదా దూరం ప్రయాణించాల్సిన  సందర్భాల్లో మీకు రూ.9.5 కి.మీ లేదా నిమిషానికి రూ.1 చార్జ్ చేస్తుంది. ఆటోలను నగర ప్రాంతాలలో ప్రయనించడానికి మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

మీ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా మీరు మీ గమ్యస్థానాలను జోడించవచ్చు ఇంకా మార్చవచ్చు. ప్యాకేజీ ఛార్జీలకు బుకింగ్ ఫీజుగా  రూ.35 అదనంగా చెల్లించాలి. పార్కింగ్ ఛార్జీలు ఏదైనా ఉంటే నేరుగా డ్రైవర్‌కు చెల్లించాలి. ఒకేసారి ముగ్గురు ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు.

మీరు యుబర్ ఆటొ  బుకింగ్ చేయలనుకుంటే ఉబెర్ యాప్ లోని ట్రిప్ ఆప్షన్స్  క్రిందికి స్క్రోల్ చేసి ఆటో రెంటల్ పై నొక్కండి.ఆటొ రెంటల్ ఒక గంటకు ధర  రూ.149 (బుకింగ్ ఛార్జీతో సహా)తో మొదలవుతుంది. గరిష్టంగా రూ. 809తో మీరు ఎనిమిది గంటల వరకు  బుక్ చేసుకోవచ్చు .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios