కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో  వాహన ధరలు  దిగి రానున్నాయి. అంతకుముందు నాలుగు చక్రాల లేదా ద్విచక్ర వాహన యజమానులకి థర్డ్ పార్టీ భీమా(ఇన్సూరెన్స్) ఉండటం తప్పనిసరి (కార్లకు మూడు సంవత్సరాలు, స్కూటర్ / బైక్‌లకు ఐదు సంవత్సరాలు).

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) కొత్త నిబంధనలు 2020 ప్రకారం ఆగస్టు 1 తర్వాత కొనుగోలు చేసే ప్రతి వాహనాలకు వర్తించనుంది.

కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి. అంతకుముందు నాలుగు చక్రాల లేదా ద్విచక్ర వాహన యజమానులకి థర్డ్ పార్టీ భీమా(ఇన్సూరెన్స్) ఉండటం తప్పనిసరి (కార్లకు మూడు సంవత్సరాలు, స్కూటర్ / బైక్‌లకు ఐదు సంవత్సరాలు).

ఒక వ్యక్తి లాంగ్ టర్మ్ మోటార్ బీమాను కూడా కొనుగోలు చేయవచ్చు, ఇందులో ఓ‌డి (ఓన్ డ్యామేజ్), టి‌పి(థర్డ్ పార్టీ)లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధన అమలుతో వినియోగదారులు మూడు లేదా ఐదు సంవత్సరాల లాంగ్ టర్మ్ భీమాను చెల్లించాల్సిన అవసరం లేదు.

also read బీఎస్-‌4 వాహనాలకు షాక్.. రిజిస్ట్రేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ...

ఏదేమైనా కొత్త నిబంధన ప్రకారం వాహన యజమాని కనీసం ఒక సంవత్సరం పాటు తప్పనిసరి థర్డ్ పార్టీ భీమా కలిగి ఉండాలి. అదనంగా, వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ఓ‌డి(ఓనర్ డ్యామేజ్)కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు.

అంతేకాకుండా, కస్టమర్లు ఎక్కువ కాలం ఒకే భీమాకి కట్టుబడి ఉండనవసరం లేదని కొత్త ఆర్డర్ పేర్కొంది, కాని వారి సౌకర్యం ప్రకారం ఇతర బీమా సంస్థలకు కూడా మారవచ్చు.

వాహన యజమానులకు ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల పాటు, నాలుగు చక్రాల వాహనాలకు మూడేళ్ల పాటు లాంగ్ టర్మ్ పాలసీలు ఉండాలని 2018 లో సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అప్పుడు బీమా కంపెనీలు వినియోగదారులకు లాంగ్ టర్మ్ పాలసీ అందించడం ప్రారంభించాయి.