‘బీఎస్‌-6’తో మార్కెట్లోకి ఓల్డ్ స్టాక్ డంపింగ్: భారీగా ధరల తగ్గుదల

‘బీఎస్‌-6’తో మార్కెట్లోకి ఓల్డ్ స్టాక్ డంపింగ్: భారీగా ధరల తగ్గుదలవచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్- 6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ -4 ప్రమాణాలను గల ఓల్డ్ స్టాక్ వెహికిల్స్ ఒకేసారి మార్కెట్లోకి డంప్ చేసే అవకాశాలు ఉన్నాయి.

BS-VI a joker in the pack, may lead to dumping of old stock: Bajaj Auto

వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఆ తేదీ నుంచి బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో బీఎస్‌-6 నిబంధనల అమలు అనేది ‘ప్యాక్‌లో జోక ర్‌’లా మారిందని బజాజ్‌ ఆటో పేర్కొంది. నిబంధనల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఎస్‌-4 వాహనాలను వదిలించుకునేందుకు కంపెనీలు ఒక్కసారిగా వీటిని మార్కెట్లోకి డంపింగ్‌ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అనవసరమైన ధరల యుద్ధానికి ఆస్కారం ఏర్పడుతుందని బజాజ్ ఆటో పేర్కొంది. బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న వాహనాలనే వచ్చే ఏప్రిల్ నుంచి విక్రయించాల్సి రావడంతో మార్కెట్లో ఇప్పుడున్న బీఎస్‌-4 వాహనాల ధరలను అనివార్యంగా తగ్గించాల్సి రావొచ్చని తెలిపింది. 

తమ కంపెనీకి చెందిన మోటార్‌సైకిళ్లు, త్రీ వీలర్లు, క్వాడ్రీసైకిళ్లు వచ్చే ఏప్రిల్‌కన్నా ముందుగానే బీఎస్-6కు అనుగుణంగా సిద్ధమవుతాయని బజాజ్ ఆటో పేర్కొంది. అయితే ఇతర కంపెనీలు ఇందుకు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ చెప్పడం మాత్రం కష్టమేనని తెలిపింది.

అలా తక్కువ ధరకు బీఎస్‌-4 వాహనాలను విక్రయించడం సంస్థల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బజాజ్‌ తెలిపింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితులతో కునారిల్లుతున్న ఆటోమొబైల్‌ పరిశ్రమకు కొత్త నిబంధనలను సరికొత్త తలనొప్పిగా మారనున్నాయని సంస్థ తెలిపింది.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఆ తేదీ నుంచి బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో బీఎస్‌-6 నిబంధనల అమలు అనేది ‘ప్యాక్‌లో జోక ర్‌’లా మారిందని బజాజ్‌ ఆటో పేర్కొంది. నిబంధనల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఎస్‌-4 వాహనాలను వదిలించుకునేందుకు కంపెనీలు ఒక్కసారిగా వీటిని మార్కెట్లోకి డంపింగ్‌ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అనవసరమైన ధరల యుద్ధానికి ఆస్కారం ఏర్పడుతుందని బజాజ్ ఆటో పేర్కొంది. బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న వాహనాలనే వచ్చే ఏప్రిల్ నుంచి విక్రయించాల్సి రావడంతో మార్కెట్లో ఇప్పుడున్న బీఎస్‌-4 వాహనాల ధరలను అనివార్యంగా తగ్గించాల్సి రావొచ్చని తెలిపింది. 

తమ కంపెనీకి చెందిన మోటార్‌సైకిళ్లు, త్రీ వీలర్లు, క్వాడ్రీసైకిళ్లు వచ్చే ఏప్రిల్‌కన్నా ముందుగానే బీఎస్-6కు అనుగుణంగా సిద్ధమవుతాయని బజాజ్ ఆటో పేర్కొంది. అయితే ఇతర కంపెనీలు ఇందుకు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ చెప్పడం మాత్రం కష్టమేనని తెలిపింది.

అలా తక్కువ ధరకు బీఎస్‌-4 వాహనాలను విక్రయించడం సంస్థల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బజాజ్‌ తెలిపింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితులతో కునారిల్లుతున్న ఆటోమొబైల్‌ పరిశ్రమకు కొత్త నిబంధనలను సరికొత్త తలనొప్పిగా మారనున్నాయని సంస్థ తెలిపింది.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios