బాలీవుడ్ ఐటెమ్ సాంగ్ బ్యూటీ కొత్త కారు.. దీని ధర తెలిస్తే షాకవుతారు..

ముంబైకి చెందిన బి‌ఎం‌డబల్యూ డీలర్‌షిప్ ఈ కారును ఇటీవల నోరా ఫతేహికి అందజేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా నోరా ఫతేహి కొత్త కారు ఫోటోలను షేర్ చేసింది.

bollywood Actor Nora Fatehi Brings Home The BMW 5 Series car

బాలీవుడ్ సినిమాలలో తన డాన్స్ తో యువతను హుశారేత్తించిన ప్రముఖ నటి నోరా ఫతేహి న్యూ ఇయర్ సంధర్భంగా కొత్త బి‌ఎం‌డబల్యూ 5 సిరీస్ కారు‌ను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన బి‌ఎం‌డబల్యూ డీలర్‌షిప్ ఈ కారును ఇటీవల నోరా ఫతేహికి అందజేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా నోరా ఫతేహి కొత్త కారు ఫోటోలను షేర్ చేసింది. నోరా ఫతేహి గతంలో మెర్సిడెస్ బెంజ్ సి‌ఎల్‌ఏ 220డి  కూడా కొనుగోలు చేశారు.

అయితే ఈ కొత్త 5 సిరీస్ కారు స్పోర్టి లుక్ లో విలాసవంతమైన అప్‌గ్రేడ్ వెర్షన్. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్  రేంజ్ ధర రూ.55.40 లక్షల నుండి మొదలై రూ.68.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంటుంది. నోరా ఫతేహి బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ లో  ఏ మోడల్ కొనుగోలు చేశారనే దానిపై స్పష్టత లేదు.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, ఆడి ఎ6, వోల్వో ఎస90, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్‌లతో పోటీపడుతుంది. బి‌ఎం‌డబల్యూ 530ఐ స్పోర్ట్, 530ఐ ఎం స్పోర్ట్ వేరియంట్లు 249 బిహెచ్‌పి, 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ అభివృద్ధి చేస్తుంది.

also read వచ్చే ఏడాదిలో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్న టెస్లా.. జులై నాటికి కార్ల డెలివరీలు.. ...

2.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్ తో పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో సెడాన్ అందించబడుతుంది. కారు కేవలం 6.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. డీజిల్ వెర్షన్ లో 520డి లగ్జరీ లైన్‌లో 2.0-లీటర్ టర్బో ఇంజన్ తో 187 బిహెచ్‌పి, 400 ఎన్‌ఎమ్‌లను అభివృద్ధి చేస్తుంది.

టాప్ రేంజ్ 530డి ఎమ్ స్పోర్ట్ 261 బిహెచ్‌పి, 620 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఇస్తుంది. 3.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్‌ ఇంజన్ లో లభ్యమవుతుంది. మూడు ఇంజన్లు 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్మిషన్ గేర్ తో వస్తాయి. 

 బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ స్పోర్టి డిజైన్ థీమ్‌తో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఇంకా మరెన్నో విలాసవంతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారుకి రిమోట్ కంట్రోల్ పార్కింగ్‌తో ఫాన్సీ బిఎమ్‌డబ్ల్యూ డిస్ ప్లే కీ కూడా వస్తుంది.

నోరా ఫతేహి తన డ్యాన్స్ తో బాలీవుడ్ లో ఎంతో  పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో కూడా నటించింది, ఇది ప్రస్తుతం చివరి దశలో ఉంది త్వరలో రీలిజ్ కానుంది. నోరా ఫతేహి చివరిసారి స్ట్రీట్ డాన్సర్ 3డి చిత్రంలో కనిపించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios