6.2 సెకన్లలో 100 కి.మీ స్పీడ్‌తో 530ఐఎం స్పోర్ట్ కారు
వాహన ప్రియులకు శుభవార్త. గంటకు 250 కి.మీ. దూరం ప్రయాణించే.. 6.2 సెకన్లలో అంటే దాదాపు కన్నుమూసి తెరిచే లోపు 100 కి.మీ స్పీడందుకునే సామర్థ్యం గల లగ్జరీ కారును జర్మనీ లగ్జరీ కార్స్ మేకర్ బీఎండబ్ల్యూ అందుబాటులోకి తెచ్చింది
జర్మనీ లగ్గజరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలోకి మరో కారును తెచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకు లోబడి చెన్నై ప్లాంట్‌లో పూర్తిగా పెట్రోల్ వినియోగంతో నడుపనున్న ఈ ‘530ఐ ఎం స్పోర్ట్’మోడల్ కారు ధరను రూ.59.2 లక్షలుగా నిర్ణయించింది.
లైవ్‌లో పరిసరాల్లో పరిణామాలు వీక్షించొచ్చు
ఈ కారు కేవలం 6.2 సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. రెండు లీటర్లు, నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన టెక్నాలజీ పరంగా ఆధునీకరించిన ఈ కారు చుట్టు ఏమి జరుగుతుందో దాంట్లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై లైవ్‌లో తెలుసుకోవచ్చు. ఈ కారు 252 హెచ్‌పీ సామర్థ్యంతో నడుస్తుంది. ఇప్పటికే ఇదే మోడల్ డీజిల్ వర్షన్ కారును దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నది.
గంటకు 250 కి.మీ పైగా ప్రయాణం దీని స్పెషాలిటీ
భద్రత ప్రమాణాలను మెరుగు పరిచే ఉద్దేశంలో భాగంగా ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లా క్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), డైనమిక్ స్టేబిలిటీ కంట్రోల్ (డీఎస్‌సీ), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్(డీటీసీ), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ), గెస్చర్-కంట్రోల్, డిస్‌ప్లే కీ తదితర ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు గంటకు 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నది.
ఏబీఎస్‌తో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ బైకులు
టీవీఎస్ మోటార్ కంపెనీ తన అపాచీ ఆర్‌టీఆర్ శ్రేణిలోని మొత్తం బైకులను యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది. ఏబీఎస్‌తో కూడిన కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 ధర రూ.85,510, ఆర్‌టీఆర్ 180 ధర రూ.90,978, ఆర్‌టీఆర్ 160 4వీ ధర రూ.89,785, ఆర్‌టీఆర్ 200 ధర రూ. 1.11 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది.
ఈ బైకులు ఇప్పటికే మార్కె ట్లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు.
రూ.లక్ష కోట్లను దాటిన టైటాన్..!
టాటా సన్స్ అనుబంధ సంస్థ టైటాన్ కంపెనీ మార్కెట్ విలువ గురువారం రూ. లక్ష కోట్లను దాటింది. దీంతో షేర్ ధర కూడా ఒక శాతం లాభపడి రూ.1,129 సరికొత్త మైలురాయిని దాటింది. గతంలో ఈ షేర్ అత్యధిక ధర రూ.1,123 మాత్రమే. ఈ మార్క్‌ను ఈ నెల 12వ తేదీనే దాటింది.
ప్రస్తుత షేర్ రేటు ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.1,00,231కోట్లు. ప్రస్తుతం 29 కంపెనీల మార్కెట్ విలువ మాత్రమే రూ.లక్షకోట్లను దాటింది. కంపెనీ 41.6శాతం వృద్ధి రేటును నమోదు చేయడంతో దాదాపు రూ.416కోట్ల లాభాలు వచ్చాయి.
కంపెనీ నగల వ్యాపారంలో దాదాపు 37శాతం విక్రయాలు వృద్ధి చెందాయి. నగల వ్యాపార రంగంలో అసంఘటిత రంగం వైపు నుంచి సంఘటిత రంగంవైపునకు మళ్లడంతో టైటాన్‌కు లబ్ధి చేకూరుతోంది.