ప్రముఖ తెలుగు స్టార్ హీరో ప్రభాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించారు.  బాహుబలి చిత్రం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో రెండవ భారతీయ చిత్రం.

సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ తన మంచి  హృదయాన్ని చాటుకున్నారు.  ప్రభాస్ ఇటీవల తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి  రూ. 73.30 లక్షల (ఎక్స్-షోరూమ్) విలువైన కొత్తగా రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చారు.

also read రోల్స్ రాయిస్ కొత్త మోడల్ సెడాన్ ఘోస్ట్‌.. పురాతన చరిత్రను దృష్టిలో పెట్టుకొని డిజైన్..

ప్రభాస్ జిమ్ ట్రైనర్ మాజీ బాడీబిల్డర్, మిస్టర్ వరల్డ్ 2010 టైటిల్‌ను కూడా పొందాడు. విలాసవంతమైన ఎస్‌యూవీ గురించి చెప్పాలంటే  స్థానికంగా తయారైన రేంజ్ రోవర్ వెలార్ గత ఏడాది భారతదేశంలో రూ.72.47 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించారు.

తరువాత కార్ తయారీ సంస్థ ఎస్‌యూవీ ధరను  రూ. 73.30 లక్షలకు పెంచారు. గతంలో ఎస్‌యూవీ కారు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్ తో అందించారు. రేంజ్ రోవర్ వెలార్  2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, నాలుగు సిలిండర్ల యూనిట్, ఇంజన్ 177 బిహెచ్‌పి వద్ద 365 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.

ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపే 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ దీనికి అందించారు. పెట్రోల్ మోడల్ కేవలం 7.1 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. బురద, మట్టి రోడ్లు, తడి రోడ్లపై  స్థిరమైన వేగాన్ని నిర్వహించడానికి సహాయపడే ఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ (ఎటిపిసి) సిస్టం కూడా ఈ ఎస్‌యూవీకి లభిస్తుంది.