ఆశలన్నీ ఫెస్టివ్ సీజన్‌పైనే.. మిడ్ సైజ్ కార్లతో విపణిలోకి

బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న కొత్త కార్లతో సేల్స్ పెంచుకోవాలని కార్ల తయారీ సంస్థలు తల పోస్తున్నాయి. వచ్చే పండుగల సీజన్ పై బారీగా ఆశలు పెట్టుకున్నాయి. త్వరలో ఐదు కంపెనీల నుంచి నూతన కార్లు ఆవిష్క్రుతం కానున్నాయి. 

Auto Co's Focussed on next Festive season

ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజురోజుకు మందగమనంలోకి జారుకుంటున్నది. అయితే వచ్చే పండగల సీజన్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా సేల్స్ లేక కునారిల్లుతున్న ఆటోమొబైల్‌ రంగం రానున్న రోజుల్లో కొత్త కార్ల విడుదల ద్వారా గట్టెక్కాలని చూస్తోంది.

మారుతి సుజుకీ ఇండియా, హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా, రెనో ఇండియా, కియా మోటార్స్‌ ఇండియా తదితర ఆటోమొబైల్ సంస్థలు వచ్చే పండుగల సీజన్‌లో నూతన కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. 

మిడ్ సైజ్ మోడల్ కార్లతో విపణిలోకి
హై ఎండ్‌ కార్ల జోలికి వెళ్లకుండా మిడ్‌ సైజ్‌ విభాగంలో ఈ కార్లను అందుబాటులోకి తేనున్నాయి. ఆటోమొబైల్‌ మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంతోనే మల్టీ యుటిలిటీ, హ్యాచ్‌బ్యాక్‌ కార్లను ఈ కంపెనీలు విడుదల చేయనున్నాయి. బీఎస్-‌6 ప్రమాణాలతో ఈ కార్లను మార్కెట్లోకి తేస్తున్నాయి.
 
హ్యుండాయ్‌లో ఇలా నో ప్రొడక్షన్ డేస్ అమలు
సేల్స్ తగ్గిన నేపథ్యంలో హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా ఆగస్టు నెలలో బాడీషాప్‌, ఇంజన్‌ షాప్‌ సహా పలు విభాగాల్లో తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది.

ఆటోమొబైల్‌ మార్కెట్లో నెలకొన్న డౌన్‌ట్రెండ్‌ వల్ల ఈ నెలలో వివిధ విభాగాల్లో నో ప్రొడక్షన్‌ డేస్‌ (ఎన్‌పీడీ)ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే మారుతీ, టయోటా, అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌ ఇదే బాటలో పయనించాయి.
 
వచ్చేవారం విపణిలోకి హ్యుండాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్
వచ్చేవారం దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా హ్యాచ్‌బ్యాక్‌ గ్రాండ్‌ ఐ10 నియో‌స్ మోడల్ కారును మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుత క్యాలడర్‌ సంవత్సరంలో హ్యుండయ్‌ తీసుకొస్తున్న మూడో కారు ఇది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్‌ ఐ10, ఐ20 మధ్య ఉన్న అంతరాన్ని ఐ10 నియోస్‌ తీరుస్తుందని హ్యుండాయ్‌ భావిస్తోంది. 

బీఎస్ -6తో హ్యుండాయ్ తొలి కారు గ్రాండ్ ఐ10 నియోస్
బీఎస్‌- 6 ప్రమాణాలతో హ్యుండాయ్‌ తీసుకువస్తున్న తొలి కారు ఇదే. పెట్రోల్‌, డీజిల్‌ ఆప్షన్లతో పాటు ఆటోమెటిక్‌ వెర్షన్‌లో ఈ కారును తెస్తోంది. కాగా ఐ10 నియోస్‌ కార్ల బుకింగ్స్‌ను ఆగస్టు 7 నుంచి కంపెనీ ప్రారంభించింది. హ్యుండాయ్‌ ఈ మధ్య కాలంలోనే కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వెన్యూను విడుదల చేసింది.

మల్టీ యుటిలిటీ వెహికిల్ ఎక్స్ఎల్ 6తో మారుతి సుజుకీ 
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ త్వరలో మార్కెట్లోకి సరికొత్త మల్టీ యుటిలిటీ వాహనం ఎక్స్‌ఎల్‌ 6ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కార్లు విక్రయించనుంది. ఎక్స్‌ఎల్‌ 6ను ఈ నెలలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. 

ఎర్టిగాకు అప్ గ్రేడ్ వర్షనే ఎక్స్ఎల్ 6
పెట్రోల్‌ ఇంజన్‌తో మాత్రమే ఈ ఎంపీవీ అందుబాటులో ఉండనుంది. మారుతి ఎర్టిగాకు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా ఎక్స్‌ఎల్‌ 6 ఉంటుందని అంచనా. కాగా దీపావళి పండుగ కంటే ముందుగా హ్యాచ్‌బ్యాక్‌ కారు ఎస్‌-ప్రెస్సోను విడుదల చేసేందుకు మారుతి సన్నాహాలు చేస్తోంది.
 
భారత్ మార్కెట్‌పై పట్టుకు రెనాల్ట్ 
ఫ్రాన్స్‌ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ భారత మార్కెట్లో మళ్లీ పట్టును చేజిక్కించుకోవడానికి సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు ట్రైబర్‌ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ కార్ల బుకింగ్స్‌ ప్రారంభించింది. 

టైబర్‌కు డస్టర్ తరహా ఆదరణపై రెనాల్ట్ ఆశలు
గతంలో డస్టర్‌కు లభించిన ఆదరణే ట్రైబర్‌కు వినియోగదారుల నుంచి స్పందన వస్తోందని రెనాల్ట్ భావిస్తోంది. సబ్‌ 4 మీటర్ల శ్రేణిలో ఏడు సీట్లతో ట్రైబర్‌ను రెనాల్ట్ రూపొందించింది. గతంలో రెనాల్ట్ ఇండియా మార్కెట్లోకి క్యాప్చర్‌ను తెచ్చినా అంతగా ఆదరణ లభించలేదు.
 
వచ్చేవారం కియా సెల్టోస్‌ విక్రయాలు షురూ..
హ్యుండాయ్‌ మోటార్‌ గ్రూప్‌ అనుబంధ కియా మోటార్స్‌ ఇండియా వచ్చే వారం నుంచి తన తొలి ఎస్‌యూవీ సెల్టోస్‌ విక్రయాలను అధికారికంగా ప్రారంభించనుంది. కియా మోటార్స్‌ ఇప్పటికే సెల్టోస్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావటంతో పండగల సీజన్‌లో అమ్మకాలు భారీగా ఉండొచ్చని అంచనా వేస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios