నూతన ఫీచర్లతో పరిమితంగా ఆడి క్యూ7

జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..భారత విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్ క్యూ7ను అందుబాటులోకి తెచ్చింది. 

Audi Q7 Black Edition Launched Limited to Just 100 Units

న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..భారత విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్ క్యూ7ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.82.15 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయించనున్న ఈ నూతన వాహనంలో పలు నూతన ఫీచర్స్‌ను జతపరిచినట్లు ఆడీ ఇండియా హెడ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం కస్టమర్లకు ఆడి మోటార్స్ కల్పించింది. వీటిలో 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు 245 హర్స్‌పవర్ల శక్తినివ్వనుండగా, 3 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన కారు 249 హెచ్‌పీల శక్తినివ్వనున్నది.

లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్ కారులో టెక్నాలజీ 45 టీడీఐపై రూ.1.02 లక్షలు, టెక్నాలజీ 45 టీఎఫ్ఎస్ఐ మోడల్ కారుపై రూ.1.05 లక్షలు అదనపు భారం పడనున్నది. క్యూ 7 మోడల్ కార్లు అత్యంత వ్యయ భరితం. ఫ్రంట్ గ్రిల్లె, ఫ్రేమ్ అండ్ ఎయిర్ ఇన్ టేక్ స్ట్రట్స్ ఇన్ టైటానియం గ్లాస్ బ్లాక్, ఖ్వాట్రో ఎంబోసింగ్‌తో గ్లాసీ బ్లాక్‌లో డోర్ ట్రిమ్ స్ట్రిప్స్ అవుతుంది. సైడ్ విండోస్, రూఫ్ గ్లాస్ బ్లాక్ లోనే లభిస్తాయి. టైటానియం మ్యాట్ బ్లాక్ రేర్ డిఫ్యూజర్‌గా నిలుస్తుంది. రూఫ్ రైల్స్, అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ ట్రీట్మెంట్ పొందుతాయి. 

అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ 12.3 అంగుళాల వర్చువల్ కాక్ పిట్, బోస్ 3డీ సౌండ్ సిస్టమ్, ఎంఎంఐ నేవీగేషన్, పనారోమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే భారతదేశంలోని ఆడి డీలర్ల వద్ద బుకింగ్స్ మొదలయ్యాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios