ఛార్జింగ్ అవసరం లేని మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్స్, మైలేజ్ తెలుసుకోండి..
ఆప్టెరా కారు సోలార్, విద్యుత్ శక్తి కలయికతో పనిచేస్తుంది. అయితే దీనిని కంపెనీ దాని నెవర్ ఛార్జ్ టెక్నాలజీగా సూచిస్తుంది, అంటే డ్రైవర్లు అధిక శక్తి కోసం ఛార్జింగ్ స్టేషన్లలో ఆపకుండా ప్రయాణాలను పూర్తిచేస్తుంది.
యు.ఎస్ స్టార్టప్ సంస్థ ఆప్టెరా ఒక్క ఫుల్ చార్జ్ బ్యాటరీతో 1,000 మైళ్ల దూరం వరకు ప్రయాణించే సోలార్, ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేసింది, దీనిని డ్రైవర్లు ఛార్జ్ చేయనవసరం లేదని సంస్థ పేర్కొంది.
ఆప్టెరా కారు సోలార్, విద్యుత్ శక్తి కలయికతో పనిచేస్తుంది. అయితే దీనిని కంపెనీ దాని నెవర్ ఛార్జ్ టెక్నాలజీగా సూచిస్తుంది, అంటే డ్రైవర్లు అధిక శక్తి కోసం ఛార్జింగ్ స్టేషన్లలో ఆపకుండా ప్రయాణాలను పూర్తిచేస్తుంది.
శాన్ డియాగోకు చెందిన సంస్థ ప్రకారం, ఒక అమెరికన్ రోజుకు 29 మైళ్ళు ప్రయాణిస్తాడు. అందువల్ల యజమాని ఎక్కడ నివసిస్తున్నాడు, ఒక రోజులో ఎంత దూరం ప్రయాణిస్తారు అనేదానిపై ఆధారపడి వారిని ప్రతిసారి ఆప్టెరా సోలార్ కారును ఛార్జ్ చేయనవసరం లేకుండా చేస్తుంది. దీని బట్టి మీ సమయంతో పాటు ప్రయాణాలను కొనసాగించవచ్చు.
also read ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు షాకిచ్చిన టాటా మోటార్స్.. గత 4 ఏళ్లలో ఇది 3వ సారి.. ...
ఆప్టెరా సోలార్ కారు 4.4 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల ఎత్తుతో మూడు చక్రాల ఆప్టెరా వాహనంలో ఇద్దరు పెద్దలు, ఒక పెంపుడు జంతువుతో ప్రయానించడానికి అని కంపెనీ తెలిపింది.
ఛార్జింగ్ స్టేషన్ లేదా పవర్ కార్డ్ ద్వారా కారును పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు, డ్రైవర్లు పగటిపూట రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సూర్యుడి నుండి వచ్చే సౌర శక్తి వాహనాన్ని చార్జ్ చేస్తుంది. ఈ సోలార్ టెక్నాలజితో కారు సంవత్సరానికి 11,000 మైళ్ళకు పైగా ప్రయాణించేలా తగినంత సూర్యరశ్మిని నిల్వ చేయడానికి రూపొందించబడింది.
సోలార్ శక్తిని మాత్రమే ఉపయోగించి ఎక్కువ రోజుల పాటు డ్రైవింగ్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్న మొదటి వాహనంగా ఇది అని కంపెనీ పేర్కొంది. ఈ కారు 3.5 సెకన్లలో గంటకు 0 నుండి 60 మైళ్ళు ప్రయాణించే వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 110 ఎంపిహెచ్.