ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన కారుని చూసారా.. టెస్లాని ట్యాగ్ చేస్తూ ట్వీట్.. నేట్టింట్లో వైరల్..
ఆనంద్ మహీంద్రా తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆనంద్ మహీంద్రా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను కూడా ఆలోచింపజేసె ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అనే విషయం మీకు తెలిసిందే. అయితే ఆనంద్ మహీంద్రా తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆనంద్ మహీంద్రా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను కూడా ఆలోచింపజేసె ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
తాజాగా ఆనంద్ మహీంద్రా ఎద్దుల బండి వీడియోను షేర్ చేశారు. ఈ ఎద్దుల బండి వెనుక భాగంలో ఆశ్చర్యపరిచే కారు ఆకారం ఉంది. వీడియోలో రెండు ఎద్దులు కారులోని సగభాగం లాగడం కనిపిస్తుంది. టెస్లా కూడా అలాంటి వాహనాలను తయారు చేయలేదని ఆనంద్ మహీంద్రా ట్వీట్ ద్వారా అన్నారు.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో ఒక క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌ను కూడా ట్యాగ్ చేశారు. "టెస్లా కార్లు ఈ తక్కువ నిర్వహణ పునరుత్పాదక, శక్తివంతమైన కారుతో కూడా పోటీ పడగలవని నేను అనుకోను." అంటూ ట్వీట్ పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కి ప్రజల నుండి ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
also read 2017లోనే కంపెనీని అమ్మివేయాలని అనుకున్న.. కానీ వారు దానికి నిరాకరించారు: టెస్లా సీఈవో ...
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో దక్షిణ భారతదేశానికి చెందినదని భావిస్తున్నారు. వీడియోలో రహదారిపై నిలబడి ఉన్న ఎద్దుల బండి కపిస్తుంది. అంబాసిడర్ కారు వెనుక భాగాన్ని ఎద్దుల బండికి వెనుక భాగంలో జోడించారు. అతను ఆ అంబాసిడర్ కారుని చూడడానికి అందంగా తీర్చిదిద్దాడు కూడా.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది ప్రశంసలను అందుకుంది. ఇప్పటివరకు మూడు లక్షల 90 వేల వ్యూస్ సాధించింది. ఈ వీడియోను డిసెంబర్ 23న ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో షేర్ చేశారు. 29 వేలకు పైగా లైక్‌లు, 4,500 సార్లు రీట్వీట్లు ఈ వీడియోకు వచ్చాయి. ఇలాంటి వినుత్నమైన ఆలోచనలలో భారతీయులు ముందంజలో ఉన్నారు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు.