మహీంద్రా స్కార్పియో ఫోటోకి ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్.. ఇంటర్నెట్ వైరల్..
మహీంద్రా గ్రూప్ కార్లకు సంబంధించి ప్రజల కృషిని తరచుగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా ప్రశంసిస్తుంటారు. ఇటీవల ఆయన మహీంద్రా స్కార్పియో మరొక ఫోటోని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు, ఇందులో మహీంద్రా కారు ఒక భవనం ఇంటి పైకప్పుపై ఉంచారు.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చైన్ బౌండ్ స్కార్పియో కారు ఫన్నీ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఒక క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో మహీంద్రా కారును చైన్ తో చెట్టుకు కట్టి ఉంచారు. బహుశా దీని ఉద్దేశ్యం ఏమిటంటే కారును ఎవరూ దొంగిలించలేరు అని కావొచ్చు.
అయితే ఆనంద్ మహీంద్రా ఆ ఫోటో పై 'ఇది హైటెక్ పరిష్కారం కాదు, కానీ ఇది వాహన యజమాని అధికారాన్ని చూపిస్తుంది. ఈ ఫోటో నాకు లాక్‌డౌన్ లాంటి అనుభూతిని ఇస్తుంది.' అంటూ క్యాప్షన్ పెట్టారు.
మహీంద్రా గ్రూప్ కార్లకు సంబంధించి ప్రజల కృషిని తరచుగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా ప్రశంసిస్తుంటారు. ఇటీవల ఆయన మహీంద్రా స్కార్పియో మరొక ఫోటోని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు, ఇందులో మహీంద్రా కారు ఒక భవనం ఇంటి పైకప్పుపై ఉంచారు.
నిజానికి ఇది ఇంటి యజమాని కారును పైకప్పుపై వాటర్ ట్యాంక్‌గా ఏర్పాటు చేశాడు. అలాగే గురువారం రోజున మహీంద్రా థార్ గురించి ట్వీట్ చేస్తూ దాని ఉత్పత్తిని పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మహీంద్రా కొత్తగా ప్రారంభించిన థార్ కేవలం ఒక నెలలోనే 20వేలకి పైగా బుకింగ్‌లు వచ్చాయని తేలిపారు. అంతేకాదు కారు డెలివరీ కోసం కస్టమర్లు 7 నెలలు వేచి ఉండాలి అని సూచించారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఆనంద్ మహీంద్రా అమెరికా ఎన్నికల గురించి ప్రస్తావించారు, ఇది కాస్త వైరల్ అయ్యింది. అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' గెలిచినట్లు పేర్కొన్న జ్యోతిష్కుడి అంచనా లేఖను ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ ద్వారా పోస్ట్ చేశారు.
ఈ అంచనా ఒకవేళ నిజమైన్తే జ్యోతిష్కుడు చాలా పాపులర్ అవుతాడని ఆనంద్ మహీంద్రా అన్నారు.