Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ మార్కెట్లోకి మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటో

కొత్త మహీంద్రా ట్రెయో ఎలక్ట్రిక్ ఆటో భారతదేశంలో పూర్తిగా డిజైన్ చేసి అభివృద్ధి చేయబడింది. 55 కిలోమీటర్ల వేగంతో ఉత్తమ-ఇన్-క్లాస్ పనితీరును అందిస్తుంది, కేవలం 2.3 సెకన్లలో 0-20 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

All New Mahindra Treo Electric Three Wheeler Launched in telangana
Author
Hyderabad, First Published Sep 29, 2020, 12:33 PM IST

మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ మహీంద్రా ట్రెయోను తెలంగాణ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర 2.7 లక్షలు. కొత్త మహీంద్రా ట్రెయో ఎలక్ట్రిక్ ఆటో భారతదేశంలో పూర్తిగా డిజైన్ చేసి అభివృద్ధి చేయబడింది.

55 కిలోమీటర్ల వేగంతో ఉత్తమ-ఇన్-క్లాస్ పనితీరును అందిస్తుంది, కేవలం 2.3 సెకన్లలో 0-20 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్త మహీంద్రా ట్రెయో సంవత్సరానికి 45,000 వరకు ఇంధన ఖర్చు ఆదా చేస్తుంది.

also read కొత్త కలర్ ఆప్షన్స్ లో బిఎస్ 6 కెటిఎం బైక్స్.. ధర ఎంతంటే ? ...

రూ.5 వేల ఎక్సేంజ్‌ బోనస్‌తో అందుబాటులో ఉండే ఈ వాహనాన్ని కేవలం రూ.50 వేల డౌన్‌ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చని, మిగిలిన మొత్తాన్ని మహీంద్రా ఫైనాన్స్‌, ఎస్‌బి‌ఐ నుంచి 10.8 శాతం వడ్డీతో రుణంగా పొందవచ్చని పేర్కొన్నది.  

తెలంగాణ ప్రకటించిన ఎలక్ర్టానిక్‌ వాహన విధానంతో రాష్ట్రంలో ఎలక్ర్టిక్‌ వాహనాలు అందుబాట ధరల్లో అందరికీ చేరువయ్యాయని మహీంద్రా ఎలక్ర్టిక్‌ ఎండీ, సీఈఓ మహేష్‌ బాబు పేర్కొన్నారు.

ఎలక్ర్టిక్‌ త్రీవీలర్స్‌ ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా అనుకూలంగా ఉంటాయని అన్నారు. మూడు సంవత్సరాల ప్రామాణిక వారెంటీ సహా అమ్మకం తర్వాత మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios