Asianet News TeluguAsianet News Telugu

బీఎస్-6తో హోండా డబ్ల్యూఆర్-వీ కొత్త మోడల్.. ధర ఎంతంటే..?

జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ విపణిలోకి డబ్ల్యూ ఆర్వీ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారును దేశీయ విపణిలోకి ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.8.50 లక్షల నుంచి మొదలవుతుంది.
 

2020 Honda WR V Facelift Launched In India
Author
Hyderabad, First Published Jul 3, 2020, 10:52 AM IST

ముంబై: ప్రముఖ ఆటో సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ మోడల్  2020  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారును భారతదేశ విపణిలో ఆవిష్కరించింది. దీని ధరలు రూ. 8.50 లక్షల నుండి ప్రారంభమై రూ. 10.99 లక్షల వరకు పలుకుతుందని కంపెనీ తెలిపింది.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో దేశీయ విపణిలో ఆవిష్కరించాలని అనుకున్నా కరోనావైరస్ మహమ్మారితో ఆలస్యమైందని జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ వెల్లడించింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ కారులో రిఫ్రెష్ స్టైలింగ్, కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో ఎస్వీ, వీక్స్ అనే  రెండు వేరియంట్లలో మాత్రమే ఇది లభ్యం కానుంది. 

బీఎస్-6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన డబ్ల్యూఆర్వీ మోడ్ కారులో 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. డీజిల్ వెర్షన్ వాహనం 99 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

పెట్రోల్ వేరియంట్ మోడల్ కారు 89 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లతో కూడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ లాంటివి జోడించింది.

also read గుడ్ న్యూస్.. లీజుకు మారుతి, హ్యుండాయ్,వోక్స్ వ్యాగన్ కొత్త కార్లు.. ...

7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

ఇక మార్కెట్లో హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్‌లిఫ్ట్ కారుకు మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హ్యుండాయ్ వెన్యూ లాంటివి ప్రధానంగా గట్టిపోటీ ఇవ్వనున్నాయి. 

హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్‌లిఫ్ట్ కారు ఆరు రంగుల్లో వినియోగదారులకు లభ్యం కానున్నది. ప్రీమియం అంబర్ మెటాలిక్, లునార్ సిల్వర్ మెటాలిక్, మోడర్న్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెలాఖరులో హోండా కార్స్ నూతన జనరేషన్ సిటీ మోడల్ కారును విపణిలో ఆవిష్కరించనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios