ఏడాది చివర్లో విపణిలోకి మెర్సిడెస్ ఏ45, ఎ45ఎస్
విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్.. మార్కెట్లో మెర్సిడెస్ ఎఎంజీ ఎ45, ఎ45ఎస్ మోడల్ కార్లనుఆవిష్కరించింది. ఇవి ఈ ఏడాది చివరికల్లా విపణిలో అడుగు పెట్టనున్నాయి.
విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ హ్యాచ్ బ్యాక్ సరికొత్త ఏ45 4మాటిక్ ప్లస్, ఏ45 ఎస్ 4మాటిక్ ప్లస్ కార్ల వివరాలను బహిర్గతం చేసింది. ఈ రెండు కార్లలో నాలుగు సిలిండర్ల ఇంజిన్లు అమర్చారు.
ఏ45 మోడల్ 480 ఎన్‌ఎం టార్క్ వద్ద 382 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఏ45 ఎస్ మోడల్ 500 ఎన్‌ఎం టార్క్ వద్ద 415 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న గుడ్‌వుడ్ ఫెస్టివల్‌లో దీనిని విడుదల చేశారు. దీనికి స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు.
నాలుగు సెకన్లలో 100 కి.మీ వేగం
ఈ కారులో అత్యంత శక్తివంతమైన 2.0లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి 8స్పీడ్ ఏఎంజీ స్పీడ్‌షిఫ్ట్ గేర్ బాక్స్‌ను అమర్చారు.
ఏ 45 మోడల్ నాలుగు క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటే.. ఏ45 ఎస్ మోడల్ 3.9క్షణాల్లోనే ఈ వేగాన్ని చేరుతుంది. ఎ 45 మోడల్ కారు గంటకు 250, ఎ45ఎస్ మోడల్ కారు 270 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంది.
ఇలా చేస్తే రేస్ మోడ్ లోకి
ఇందులో డ్రిఫ్ట్ మోడ్ కూడా ఉంది. ట్రాన్స్‌మిషన్‌ను మాన్యూవల్‌లోకి మార్చేసి.. ఈఎస్‌పీని ఆపివేస్తే కారు వెంటనే రేస్ మోడ్‌లోకి మారిపోతుంది. ఈ కారులో మొత్తం ఆరు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
స్లిపరీ, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ఇండివీడ్యూవల్, రేస్ మోడ్‌లను ఇచ్చారు. కారు ఇంటీరియర్ సొగసు విషయంలో బెంజ్ ఏమాత్రం రాజీపడలేదు. 8- స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్, న్యూలీ డెవలప్డ్ మల్టీ ప్లేట్ క్లచ్, 4మ్యాటిక్ ప్లస్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి.
మెర్సిడెస్ ఏ45 సిరీస్ ఫీచర్లు ఇవి
డ్రైవింగ్ మోడ్‌కు అనుగుణంగా రీ ఇంజినీర్డ్ స్టీరింగ్ ర్యాక్, వ్యారియబుల్ రేషియో, 2 డిఫరెంట్ సాఫ్ట్ వేర్ మ్యాప్స్ తదితర ఫీచర్లు చేర్చారు. వైడర్ ఫ్రంట్ ట్రాక్ అండ్ బీ స్పోక్ ఫ్రంట్ యాక్సిల్ క్యారియర్, నూతనంగా అప్ డేట్ చేశారు. బేస్ ఎ45 కారులో 18 అంగుళాల వీల్స్, ఎస్ వర్షన్ మోడల్ కారు వీల్స్ 19 అంగుళాల విస్తీర్ణం కలిగి ఉంటాయి.
బౌండరీలు ఆశిస్తే సింగిల్స్‌కే పరిమితం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బౌండరీలు కొడతారని ఆశిస్తే స్టడీ సింగిల్స్ తీశారని మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. రన్‌రేట్ తగ్గకుండా చూసుకుంటూ..దీర్ఘకాలానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆకాంక్ష ఆమె బడ్జెట్‌లో కనిపించిందన్నారు.
అందరూ ఆశించినట్టుగా ..పలు అంచనాలకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే విధానం మోదీ ప్రభుత్వం దీర్ఘకాలిక బడ్జెట్‌పై దృష్టి పెట్టిందన్నారు.
జీఎస్టీ తగ్గింపుపై మహీంద్రా ఆశలు అడియాసలు
ప్యాసింజిర్ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తగ్గింపును ఆశించి భంగపడిన ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ అన్ని కార్లపై జీఎస్టీని తగ్గించే బదులు, మొబిలీటీ, ప్రోత్సాహకాలతో మాత్రమే సరిపెట్టారని పేర్కొన్నారు.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో సీతారామన్ బడ్జెట్ దేశానికి సహాయపడుతుందని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థ పుంజుకునే దశలో సీతారామన్ ఎత్తుగడలు, అడుగులతో ఆర్థికరంగం పుంజుకోనుందని, ఆర్థిక వ్యవస్థ అనే ఇంజిన్‌కు ఇవి లూబ్రికెంట్‌లా పనిచేస్తాయంటూ వరుస ట్వీట్లలో ప్రశంసించడం విశేషం.