Asianet News TeluguAsianet News Telugu

రూ.11వేలకే హ్యుండాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌... ప్రీబుకింగ్ ప్రారంభం

హ్యుండాయ్ మోటార్స్ తన మూడోతరం ‘గ్రాండ్ ఐ10 నియోస్’ మోడల్ కారును ఈ నెల 20న విపణిలోకి తీసుకు రానున్నది.

2019 Hyundai Grand i10 unveiled in India on Wednesday
Author
Hyderabad, First Published Aug 8, 2019, 1:55 PM IST

ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుండాయ్‌ త్వరలో ఆవిష్కరించనున్న గ్రాండ్‌ ఐ10 నియోస్‌ 2019ని బుధవారం ప్రకటించింది. మూడో తరం  ‘ఐ10 బుకింగ్స్‌’ను ప్రారంభించింది. కేవలం రూ.11 వేలకు ఈ కారును  ప్రీ బుకింగ్‌ అవకాశాన్ని కల్పిస్తోంది.  గ్రాండ్ ఐ 10 నియోస్ పది వేరియంట్లలో మార్కెట్లోకి రానున్నది. ఈ నెల 20వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. డెలివరీలు ఈ నెలాఖరులో మొదలు అవుతాయని భావిస్తున్నారు.

హ్యుండాయ్‌ కొత్త కారులో ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతోపాటు యాపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వంటి ఇన్‌ఫోటైమెంట్‌ ఫీచర్లను జతచేర్చింది. బీఎస్‌-6 నిబంధనల కనుగుణంగా 1.2-లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజన్లతో ఇది లాంచ్‌ చేయనుంది. 

ప్రస్తుతం గల 4 స్పీడ్‌కు బదులు 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌తో రానుంది. గ్రాండ్ ఐ 10 నియోస్ పెట్రోల్ బేస్ వేరియంట్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మాగ్నా,  స్పోర్ట్జ్ వేరియంట్లలో ఆప్షన్‌గా కంపెనీ  ఏఎంటీ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. 

గత 21 ఏళ్లుగా  ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తున్న హ్యుండాయ్‌ సరికొత్త టెక్నాలజీతో భారతీయ ఆటో పరిశ్రమలో హ్యుండాయ్‌ ఆటోమొబైల్‌ పలు సరికొత్త కొల మానాలను సృష్టించిందని  హ్యుండాయ్‌ సీఎండీ ఎస్‌ఎస్‌ కిమ్‌ చెప్పారు.

కొత్త గ్రాండ్ ఐ 10 నియోస్ మా మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. శాంత్రో మినహా అన్ని డీజిల్ ఇంజిన్ కార్లను హ్యుండాయ్ కొనసాగిస్తున్నది. కానీ మార్కెట్ లీడర్ మారుతి సుజుకి మాత్రం బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అన్ని డీజిల్ కార్లను ఉపసంహరిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios