విపణిలోకి బ్లూ లింక్ టెక్నాలజీ: 3న భారత విపణిలోకి హ్యుండాయ్ ‘ఎలంట్రా’!!

భారత విపణిలోకి బ్లూ లింక్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కారు ‘ఎలంట్రా’ను దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ ఆవిష్కరించనున్నది. వచ్చే నెల మూడో తేదీన విపణిలోకి రానున్నది.

2019 Hyundai Elantra to get Blue Link technology features

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ ఇండియా.. భారత విపణిలోకి సరికొత్త ‘ఎలంట్రా’ మోడల్ కారును విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. వచ్చేనెల మూడో తేదీన హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి విడుదల చేయనున్నది. ఈ కారులో బ్లూ లింక్ కనెక్టెడ్ కారు టెక్నాలజీని వినియోగించారు.

ఈ ఫీచర్ ఉన్న తొలి ఎగ్జిక్యూటివ్ సెడాన్ మోడల్ కారుగా ‘ఎలంట్రా’ నిలిచింది. ఈ కారులో మొత్తం 34 హ్యుండాయ్ బ్లూ లింక్ ఫీచర్లు ఉన్నాయి. వీటిల్లో 10 ఫీచర్లు భారతదేశ విపణి కోసమే డిజైన్ చేశారు. ఈ 34 ఫీచర్లను ఏడు క్యాటగిరిల్లోకి విడదీశారు. 

సేఫ్టీ, సెక్యూరిటీ, రిమోట్, వీఆర్ఎం (వెహికల్ రిలేషన్ మేనేజ్మెంట్), ఎల్బీఎస్ (లోకేషన్ బేస్డ్ సర్వీసులు). అలర్ట్స్ సర్వీసులు, వాయిస్ రికగ్నిజన్ సర్వీసులుగా విడదీశారు. దీంతోపాటు ఈ కారులో బీఎస్-6 పెట్రోల్ ఇంజిన్ కూడా అమర్చింది. 

సేఫ్టీతోపాటు ఆటో క్రాష్ నోటిఫికేషన్, ఎస్వోస్/ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, పానిక్ నోటిఫికేషన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సెక్యూరిటీ, స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్, స్టోలెన్ వెహికల్ నోటిఫికేషన్, స్టోలెన్ వెహికల్ ఇమ్మోబిలైజేషన్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసింది.

ఇంకా రిమోట్ డోర్ లాక్ ఎన్ అన్ లాక్, రిమోట్ హార్న్ హాంక్ ఎన్ లైట్, ఆటో డీటీసీ చెక్, మాన్యువల్ డీటీసీ చెక్, మెయింటెనెన్స్ అలర్ట్, జియో ఫెన్స్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టైం ఫెన్సింగ్ అలర్ట్, ఐడిల్ అలర్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు వాయిస్ రికగ్నిజిషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ సియోన్ సియోబ్ కిమ్ మాట్లాడుతూ ‘అత్యాధునిక టెక్నాలజీతో పని చేసే హ్యుండాయ్ తన వినియోగదారులకు సంతోషాన్ని పంచుతుంది. హ్యుండాయ్ మోటార్స్ యంగ్ అండ్ డైనమిక్ టెక్నాలజీ డ్రైవెన్ బ్రాండ్ కలిగి ఉంది’ అని తెలిపారు. 

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ సియోన్ సియోబ్ కిమ్ మాట్లాడుతూ ‘ఎలంట్రా 2019 గ్లోబల్ బ్లూ లింక్ టెక్నాలజీ వాడిన తొలి ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ కానున్నది.

దీనిలో ప్రత్యేకంగా భారతదేశ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని ఫీచర్లు ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’ అని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios