మార్కెట్‌లోకి పోర్డ్ పిగో న్యూ ఎడిషన్...రూ.73,700 భారీ తగ్గింపుతో

ఫోర్డ్ సంస్థ మార్కెట్లోకి ఫొగో 2019 మోడల్ అప్ డేట్ వర్షన్ విడుదల చేసింది. పాత మోడల్ కార్లతో పోలిస్తే నూతన మోడల్ కార్లపై రూ.73,700 చౌక అని తెలిపింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మార్కెట్లోకి ప్రవేశించిన ఫిగో 2019 మోడల్ కారు వోక్స్ వ్యాగన్ పోలో, టాటా టియాగో, హ్యుండాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. 

2019 Ford Figo facelift vs rivals: Price, specifications comparison

న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా తన హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ ఫిగోలో 2019 ఎడిషన్‌ కారును శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.15 లక్షలుగా నిర్ణయించింది. ఆయా వేరియంట్లను బట్టి ఫిగో కారు ధర పాత ఫిగో మోడల్ కారుతో పోలిస్తే రూ.73,700 వరకు తక్కువకు లభిస్తుంది.

కొత్త ఫిగో మోడల్ కారును సమగ్రంగా రీడిజైన్‌ చేశామని ఫోర్డ్ ఇండియా తెలిపింది.  ఇందులో 1,200కు పైగా కొత్త విడిభాగాలను వినియోగించామని, సేఫ్టీ టెక్నాలజీలను అప్ డేట్ చేశామని కంపెనీ తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో మూడు వేరియంట్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. 

పెట్రోల్‌ వేరియంట్‌ 1.2 లీటర్‌, 1.5 లీటర్‌ ఇంజన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్‌ కార్ల ప్రారంభ ధర రూ.5.15 లక్షలు ఉండగా.. టాప్‌ ఎండ్‌ ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ ధర రూ.8.09 లక్షల వరకు ఉంది. తగ్గిన ధరల శ్రేణి రూ.19,000 నుంచి రూ.67,600 వరకు ఉంది. డీజిల్‌ వెర్షన్‌ ధరల శ్రేణి రూ.5.95 లక్షల నుంచి రూ.7.74 లక్షల వరకు ఉంటుంది. డీజిల్‌ వేరియంట్లపై ధరల తగ్గుదల రూ.25,400 నుంచి రూ.73,700 వరకు ఉంది. 

ఫిగో బ్లూ వేరియంట్‌లో ప్రీమియం అలాయ్స్‌ వీల్స్, 15 అంగుళాల టైర్లు, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, ఆటోమెటిక్‌ హెడ్‌లాంప్స్‌, ఎలక్ర్టోక్రోమిక్‌ ఇన్‌సైడ్‌ వ్యూ మిర్రర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఎలక్ర్టానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ర్టిబ్యూషన్‌ (ఈబీడీ) వంటి భద్రతా ఫీచర్లు కొత్త ఫిగోలో ఉన్నాయి. . ఫిగో పెట్రోల్‌ కారు లీటరుకు 16.3 కిలో మీటర్లు, డీజిల్‌ కారు 25.5 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో వున్న మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10, టాటా టియాగో, వోక్స్ వ్యాగన్ పోలో మోడల్ కార్లతో 2019 ఫిగో పోటీపడే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios