వచ్చే నెల నుండి గురుగ్రామ్‌లోని నాలుగు ప్రదేశాలలో జోమాటో ఇన్‌స్టంట్ ప్రారంభమవుతుంది. అయితే రోల్ అవుట్ టైమ్‌లైన్ గురించి కంపెనీ వివరాలను వెల్లడించలేదు.
దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ అప్లికేషన్‌లలో ఒకటైన జోమాటో (Zomato) ఆహార ప్రియుల కోసం 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవను ప్రకటించింది. జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సోమవారం సాయంత్రం ఫాస్ట్ డెలివరీ సేవను ట్విట్టర్ ద్వారా తెలిపారు. "జొమాటోలో త్వరలో 10 నిమిషాల ఫుడ్ డెలివరీ రాబోతోంది" అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు వివిధ టెక్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి 10 నిమిషాలలో కిరాణా సామన్ల డెలివరీ సేవలను చూశారు. కానీ ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించడం తొలిసారి.
ఒక అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో కంపెనీ ఫౌండేర్ దీపిందర్ గోయల్ “బ్లింకిట్ (క్విక్ కామర్స్ స్పేస్ లో జోమాటో పెట్టుబడులలో ఒకటి) రెగ్యులర్ కస్టమర్‌గా మారిన తర్వాత, Zomato ద్వారా 30 నిమిషాల డెలివరీ సమయం చాలా నెమ్మదిగా ఉందని నేను భావించాను. సరైన సమయంలో డెలివరీ చేయకపోతే నిరుపయోగంగా మారతాయి. మేము వేగంగా డెలివరీ చేయకపోతే, మరొకరు చేస్తారు. టెక్ పరిశ్రమలో మనుగడ సాధించడానికి కొత్త ఆవిష్కరణలు, ముందుండి నడిపించడమే ఏకైక మార్గం. మేము మా 10 నిమిషాల ఫుడ్ డెలివరీని జోమాటో ఇన్స్టంట్ తో అందిస్తున్నాము” అని అన్నారు.
"రెస్టారెంట్లను క్రమబద్ధీకరించడం సమయానికి ఫాస్ట్ డెలివరీ" అనేది Zomato మొబైల్ యాప్‌లో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో ఒకటి అని గోయల్ హైలైట్ చేసారు.ఈ క్విక్ డెలివరీ సేవలు కస్టమర్‌లకు గొప్పవి, కానీ డెలివరీ ఏజెంట్‌లకు అంతగా కాదు. దేశంలో 10 నిమిషాల కిరాణా డెలివరీ సేవ ఊపందుకున్నప్పటి నుండి, డెలివరీ ఏజెంట్ల జీవితాలను ప్రమాదంలో పడే వివిధ సంఘటనలు ఉన్నాయి. ఆహారాన్ని వేగంగా డెలివరీ చేసేందుకు జొమాటో డెలివరీ భాగస్వాములపై ఎలాంటి ఒత్తిడి చేయదని గోయల్ స్పష్టం చేశారు.
“మేము మా ఫాస్ట్ డెలివరీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక స్పష్టతతో ప్రారంభిస్తాము, ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి మేము డెలివరీ భాగస్వాములపై ఎటువంటి ఒత్తిడి చేయము. అలాగే డెలివరీ పార్ట్‌నర్‌లను ఆలస్యంగా డెలివరీ చేసినందుకు మేము జరిమానా విధించము. డెలివరీ భాగస్వాములకు వాగ్దానం చేసిన డెలివరీ సమయం గురించి తెలియజేయబడదు. టైమ్ ఆప్టిమైజేషన్ రోడ్డుపై జరగదు అలాగే ఎవ్వరి ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టదు, ”అని పేర్కొన్నాడు.
ఈ సర్వీస్ ప్రారంభం విషయానికొస్తే, వచ్చే నెల నుండి గురుగ్రామ్‌లోని నాలుగు ప్రదేశాలలో Zomato ఇన్‌స్టంట్ ప్రారంభమవుతుంది. రోల్ అవుట్ టైమ్‌లైన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. Zomato ఇన్‌స్టంట్ విజయవంతమైతే, Swiggy వంటి ప్రత్యర్థి ఫుడ్ డెలివరీ అప్లికేషన్‌లు కూడా భవిష్యత్తులో ఇలాంటి ఇన్స్టంట్ ఫుడ్ డెలివరీ సేవలతో ముందుకు వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కొన్ని నెలల క్రితం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ప్రారంభించిన తర్వాత, జొమాటో బ్లింకిట్‌లో పెట్టుబడి పెట్టింది (గతంలో గ్రోఫర్స్). Blinkit, 10 నిమిషాల కిరాణా డెలివరీ సర్వీస్ అనేది 10 నిమిషాల కిరాణా డెలివరీ సర్వీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే, ఇన్‌స్టామార్ట్ ల కాకుండా కార్ట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌కు రూ.9 వసూలు చేస్తుంది.
