Asianet News TeluguAsianet News Telugu

స్త్రీలు లేదా పురుషులు; ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారో తెలుసా ?

ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ సర్వసాధారణం. ఇంటికి రోజుకు ఒక పార్శిల్ వస్తుంటుంది. దీనికోసం ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనే విషయంపై నిర్వహించిన సర్వే ఆశ్చర్యం కలిగించింది. 
 

womans or menes; Who spends more money in online shopping?-sak
Author
First Published Feb 27, 2024, 12:12 PM IST

షాపింగ్ విషయానికి వస్తే మహిళలు ఎక్కువ దృష్టి పెడతారు. మహిళలు ఎక్కువగా షాపింగ్ చేస్తారనే సామెత కూడా ఉంది. స్త్రీలు అందం పెంచే వస్తువులు, బట్టలు, బూట్లు మొదలైన వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పురుషులు నాలుగు లేదా ఐదు రోజులకి  రెండు  టీ షర్ట్లు  ఇంకా ఒక జత ప్యాంటు ధరించవచ్చు. అయితే ఇలా  మహిళలకు సాధ్యం కాదు. సరైన మ్యాచింగ్ డ్రెస్, లిప్‌స్టిక్ ఇలాంటివి లేకుండా ఇంటి నుండి బయటకు అడుగు పెట్టరు. మనకంటే ఇంట్లో భార్యాపిల్లలకు ఎక్కువ బట్టలు  కొనిపెట్టే   మగవాళ్ళున్నారు. షాపింగ్‌లో మహిళలే ఎక్కువ అని చెప్పుకునే వారికి షాకింగ్ రిపోర్ట్. కానీ ఆ  నమ్మకం  అబద్ధం. 

ఇది ఆన్‌లైన్ యుగం. ఎండ, వానకు తడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేసేవారు చాలా తక్కువ. మగవాళ్ళు కూడా షాపింగ్ చేయడానికి స్టోర్స్  వెళ్లడానికి ఇష్టపడరు. ఈ-కామర్స్  కంపెనీలు ఇచ్చే ఆఫర్ల కోసం ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్‌లో పురుషులదే పైచేయి. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ దీనిపై ఓ పరిశోధన చేసింది. 

ఇది డిజిటల్ రిటైల్ ఛానెల్స్ అండ్ కన్స్యూమర్స్: యాన్ ఇండియన్ పెర్స్‌పెక్టివ్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆన్ లైన్ షాపింగ్ చేసేవారిలో పురుషులే అగ్రగామిగా ఉన్నారన్న  సంగతి తెలిసింది. 

నివేదిక ప్రకారం, 23 శాతం పురుషులు, 16 శాతం మహిళలు ఎలక్ట్రానిక్ పరికరాల కోసం షాపింగ్ చేస్తున్నారు. 47 శాతం మంది పురుషులు, 58 శాతం మంది మహిళలు ఫ్యాషన్ వేర్ కోసం షాపింగ్ చేస్తున్నారని నివేదిక వెల్లడించింది.

ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి టైర్-1 నగరాలతో పోలిస్తే టైర్ 2 నగరాలైన జైపూర్, లక్నో, నాగ్‌పూర్ ఇంకా కొచ్చిలోని ప్రజలు ఫ్యాషన్ ఇంకా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారని నివేదిక వెల్లడించింది. 

ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆడవారి కంటే పురుషులే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ కోసం మహిళలు రూ.1,830 వెచ్చించగా, పురుషులు రూ.2,484 ఖర్చు చేస్తున్నారు. స్త్రీల కంటే పురుషులు 36 శాతం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ పురుషులు ఎక్కువ ఖర్చు చేస్తారు కానీ సమయాన్ని ఆదా చేస్తారు. పురుషుల కంటే మహిళలు తక్కువ ఖర్చు చేస్తున్నప్పటికీ ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 

టైర్-1 నగరాల్లోని ప్రజల కంటే టైర్-2, టైర్-3 అండ్ టైర్-4 నగరాల్లోని ప్రజలు  ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. టైర్-1 నగరాల్లోని ప్రజలు రూ.1,119 వెచ్చించగా, టైర్-2, టైర్-3, టైర్-4 కస్టమర్లు వరుసగా రూ.1,870, రూ.1,448, రూ.2,034 ఆన్‌లైన్ షాపింగ్ కోసం వెచ్చిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత ఈ ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. నివేదిక ప్రకారం, క్యాష్ ఆన్ డెలివరీ చేసే వారి సంఖ్య కూడా  తక్కువేమీ కాదు. 

Follow Us:
Download App:
  • android
  • ios