సారాంశం

EPF సభ్యులు మరణించిన సందర్భంలో నామినీ లేనప్పుడు నామినీ సమీప బంధువు లేదా చట్టపరమైన వారసుడు  నిధులను ఉపసంహరించుకోవచ్చు.

ఉద్యోగుల భవిష్య నిధి లేదా EPF అనేది భారత ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ద్వారా నిర్వహించబడే పొదుపు పథకం. ఈ పథకం కింద ఉద్యోగికి  యజమాని/కంపెనీ    ప్రతి ఉద్యోగి  ప్రాథమిక జీతం ఇంకా డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం EPFకి జమ చేస్తారు . ఈపీఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుతం 8.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 

EPF సభ్యులు చనిపోతే డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి.. ? ఈ పరిస్థితుల్లో నిధులను నామినీ లేదా నామినీ లేనప్పుడు సన్నిహిత కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన వారసుడు ఉపసంహరించుకోవచ్చు. EPF ఫారమ్ 20లో సభ్యుడు ఇంకా నామినీ వివరాలను ఎంటర్ చేయాలి. ఈ సమాచారం అందించిన  తర్వాత నామినీ క్లెయిమ్ ఫారమ్ ఆమోదం వివిధ దశలలో SMS నోటిఫికేషన్‌లను అందుకుంటారు.

ఈ ప్రక్రియ తర్వాత హక్కుదారుడు డబ్బు అందుకుంటారు. హక్కుదారుడు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు ఎలక్ట్రానిక్‌గా  EPF  మొత్తం క్రెడిట్ చేయడం ద్వారా పేమెంట్ చేయబడుతుంది. వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయగల క్లెయిమ్ ఫారమ్‌లోని అన్ని విభాగాలలో తప్పనిసరిగా క్లెయిమ్‌దారుడు ఇంకా EPF సభ్యులు ఇద్దరూ సంతకం చేసి ఉండాలి.

పీఎఫ్ ఖాతా తెరిచి ఐదేళ్లు పూర్తి కాకుండానే ఉద్యోగి ఈపీఎఫ్ నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తే పన్ను వర్తిస్తుంది. అంటే పదవీ విరమణ ఆధారిత పెట్టుబడి  అయిన EPF ఖాతా నుండి ఉపసంహరణపై TDS చెల్లించబడుతుంది.