Asianet News TeluguAsianet News Telugu

WhatsApp: చానెల్స్ పేరుతో వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్ విడుదలకు సిద్ధం..ఈ ఫీచర్ విశేషాలు ఏంటంటే..?

WhatsApp Channels: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫారంగా పేరుపొందిన వాట్సప్ ఛానల్స్ పేరిట సరికొత్త ఫీచర్లు ప్రవేశ పెడుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఎంపిక చేసుకున్న చానల్స్ హ్యాండిల్స్ నుంచి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందవచ్చు. ప్రైవసీ విషయంలో కూడా వినూత్నమైన పద్ధతిలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మెటా ఇప్పటికే ప్రకటించింది. భారత్ లో అతి త్వరలోనే ఈ ఫీచర్ ప్రవేశపెట్టబోతున్నారు.

WhatsApp Ready to release a new feature from WhatsApp called Channels MKA
Author
First Published Jun 8, 2023, 6:11 PM IST

WhatsApp Channels: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ తో మార్కెట్లో సందడి చేస్తోంది చానల్స్ పేరిట ఈ ఫీచర్ ను  ప్రవేశ పెట్టబోతోంది ఈ సందర్భంగా మాతృ సంస్థ అయిన మెటా చానల్స్ గురించి అనేక విశేషాలను పంచుకుంది. ముఖ్యంగా ఈ చానల్స్ ఫీచర్ వ్యాపారస్తులకు అలాగే కంటెంట్ క్రియేటర్లకు చాలా ఉపయోగపడుతుందని కంపెనీ క్లెయిం చేస్తోంది. ఈ ఛానల్ ఫీచర్ ద్వారా యూజర్స్ ఒక కొత్త టాబా ద్వారా అప్డేట్స్ పొందుతారని కంపెనీ చెబుతోంది. ఇందులో కంపెనీ ఎప్పటికప్పుడు విడుదల చేసే అప్డేట్స్ యూజర్స్ కనుగొనవచ్చు. ఈ  అప్డేట్స్ కోసం   ప్రత్యేకమైన టాబ్ ఫీచర్ ప్రవేశపెట్టినట్లు మెటా పేర్కొంది. 

ఇప్పటికే ఈ చానల్స్ ఫీచర్ వాట్సప్ పోటీదారు అయిన టెలిగ్రామ్ యాప్ లో అందుబాటులో ఉంది.  ఈ ఛానెల్ ఫీచర్ సహాయంతో,  ఎంపిక చేసుకున్న వాట్సప్ గ్రూపులో మీ సందేశాలను బ్రాడ్ కాస్ట్ చేయవచ్చు.  WhatsApp ఛానెల్‌ ఫీచర్ ప్రధానంగా కాలేజీలు, ఆర్గనైజేషన్స్,  కంపెనీలకు చాలా ఉపయోగకరమైన ఫీచర్‌గా చెప్పవచ్చు. 

వ్యక్తులు, సంస్థను నుండి నేరుగా WhatsAppలో ముఖ్యమైన అప్‌డేట్‌లను పొందడానికి సులభమైన మార్గం అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ 'ఛానెల్స్'ని 'అప్‌డేట్స్' అనే కొత్త ట్యాబ్‌ ద్వారా పరిచయం చేయనున్నారు. WhatsApp ఛానెల్‌ ఫీచర్ కొలంబియా, సింగపూర్‌లలో ప్రారంభించింది. దీన్ని త్వరలో భారతదేశంతో సహా మరిన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. 

వన్ టూ మెనీ కాన్సెప్ట్ తో ఈ చానల్స్ ఫీచర్ ను వాట్సాప్ రూపొందించినట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా యూజర్లు తమకు నచ్చిన ఛానల్స్ ను ఎంచుకొని అప్డేట్స్ పొందవచ్చని తెలుస్తోంది ఇందుకోసం ఫైండ్ చానల్స్ పేరిట క్లిక్ చేసి నచ్చిన ఛానల్స్ ను సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఈ చానల్స్ ఫీచర్లో వాట్సాప్ ప్రైవసీకి పెద్దపీట వేస్తున్నట్లు చెబుతోంది

ఎంపిక చేసిన చానల్స్ నుంచి మనం పొందే మెసేజ్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండదని చెబుతున్నారు.  కానీ  ప్రైవసీ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కంపెనీ చెబుతోంది. అయితే యూజర్లు ఏ ఛానల్ లో ఫాలో అవుతున్నారో ఇతరులు తెలుసుకునే వీలు లేకుండా చేస్తున్నారు. అలాగే యూజర్స్ ఫోన్ నెంబరు ఇతర వివరాలను గోప్యంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఇతర  సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లలో మనం ఏ చానల్స్ ను అయితే ఫాలో అవుతున్నామో అవి అందరికీ కనిపిస్తాయి.  కానీ వాట్సాప్ ప్రవేశపెట్టే ఈ చానల్స్ లో మాత్రం ఇతరులకు మనం ఫాలో అయ్యే చానల్స్ వివరాలు తెలియవు.  

వాట్సప్ ఇప్పటికే పలు అప్డేట్స్ తో యూజర్లకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  ఇప్పటికే వాట్సాప్ తన కాంపిటీటర్స్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు  కొత్త కొత్త ఫీచర్లతో సిద్ధం అవుతోంది. తాజాగా వస్తున్న ఈ చానల్స్ ఫీచర్ వాట్స్అప్ ఎక్స్పీరియన్స్ ను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు.  అలాగే వ్యాపారస్తులు కంపెనీలకు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి చక్కటి సాధనం అవుతుందని భావిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios