మార్చి 2022తో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి ఎర్నింగ్స్ అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నప్పుడు, భారతదేశపు అగ్రశ్రేణి IT కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండు సంవత్సరాలకు పైగా వర్క్ ఫ్రం హోం ద్వాారా పని చేసిన తర్వాత ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిపించే ప్రణాళికలను ఆవిష్కరించింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ ను అన్ని కంపెనీలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆన్ లైన్ ద్వారా పని చేయగలిగే అవకాశం ఉన్న అన్ని కంపెనీలు ఈ విధానాన్నే ఎంచుకున్నాయి. కానీ కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ దాదాపు దేశంలో పూర్తి కావొస్తున్న తరుణంలో పరిస్థితి మెరుగుపడుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) కూడా తన ఉద్యోగులను ఆఫీసులకు (Back To Office) పిలిపించుకోవడం ప్రారంభించింది. ఈ మేరకు కంపెనీ ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్లకు ఆఫీసు నుంచి పిలుపు
మింట్‌లో ప్రచురితమైన వార్తల ప్రకారం, ప్రస్తుతం ఉద్యోగులందరు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కంపెనీలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు 50 వేల మంది మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా వారానికి 3 రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లాలి. మిగిలిన రెండు రోజులు, ఇతర ఉద్యోగుల మాదిరిగానే కూడా ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది.
TCS యొక్క CEO మరియు MD రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, “ఈ నెల నుండి అంటే ఏప్రిల్ నుండి, కంపెనీ సీనియర్ అసోసియేట్‌లు కార్యాలయానికి రావడం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. కార్యాలయానికి పిలిచే ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచుతామన్నారు. ఈ ఏడాది మధ్యలో అంటే జూన్-జూలై నాటికి చాలా మంది ఉద్యోగులు (80 శాతం) ఆఫీసు నుంచే పని చేయడం ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల జీతం పెరగనుంది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022-23లో టిసిఎస్ తన ఉద్యోగుల వేతనాన్ని 6-8 శాతం పెంచుతుందని ఎండి రాజేష్ గోపీనాథన్ తెలిపారు. గతేడాది కూడా ఈ వేతనాన్ని కంపెనీ పెంచింది.
కొత్త ఉద్యోగుల నియామకం..
గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో, కంపెనీ 35,209 కొత్త ఉద్యోగులను నియమించుకుంది. త్రైమాసికంలో ఏ కంపెనీ చేసిన అత్యధిక అపాయింట్‌మెంట్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,92,195కి చేరుకుంది.
TCS షేర్లు పోర్టు ఫోలియోలో ఉందా...బ్రోకరేజీలో ఏం చెబుతున్నాయో చూడండి...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2022-22 నాల్గవ త్రైమాసికంలో రూ.9926 కోట్ల నికర లాభంతో చక్కటి ఫలితాలను ఆర్జించింది. సంస్థ ఈ లాభం సంవత్సర ప్రాతిపదికన 7.4 శాతం ఎక్కువ. నాలుగో త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీ ఆదాయం దాదాపు 16 శాతం పెరిగి రూ.50591 కోట్లకు చేరుకుంది. దీంతో మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక్కో షేరు టీసీఎస్ ధర రూ.3722కి పెరిగింది.
క్లౌడ్ మైగ్రేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో జరిగిన ఈ ఒప్పందం టెక్నాలజీ రంగంలో TCSను బలోపేతం చేసింది. కంపెనీ పరిమాణం, సామర్థ్యాలను అంచనా వేసి చూస్తే ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చని దేశీయ బ్రోకరేజీ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.
బలమైన మార్కెట్ స్థానం
టిసిఎస్ తన బలమైన మార్కెట్ స్థానాన్ని నిలకడగా కొనసాగిస్తోంది. ఐటీ రంగంలో అత్యుత్తమ సంస్థగా నిలిచింది. ప్రాఫిట్ అండ్ రిటర్న్ ఫ్రంట్‌లో TCS తన పోటీదారుల కంటే మెరుగైన స్థితిలో ఉండటానికి ఇదే కారణం. బలమైన వృద్ధి దృక్పథం కారణంగా, మోతీలాల్ ఓస్వాల్ TCSపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంది. లాంగ్ టర్మ్ లో రూ.4,240 టార్గెట్ తో టీసీఎస్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చని పేర్కొంది.
ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తన హోల్డ్ రేటింగ్‌ను రూ.3519 వద్ద కొనసాగించింది. TCS మెరుగైన సరఫరా వైపు నిర్వహణ, సామర్థ్యం, డొమైన్ సామర్థ్యాలను కలిగి ఉందని బ్రోకరేజ్ హౌస్ చెబుతోంది. కాబట్టి రానున్న కాలంలో ఇది మరింత వేగవంతమవుతుందని అంచనా వేయవచ్చు.
