Asianet News TeluguAsianet News Telugu

గోల్డ్ క్యారెట్ అంటే ఏంటి..? అసలు 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడాలేంటి..?

 ప్రతి శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాదు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది,  ధరించేది కూడా భారతీయ మహిళలే. 

what is pure gold and difference between 24 and 22 carat gold
Author
Hyderabad, First Published Dec 18, 2020, 5:58 PM IST

బంగారం భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాదు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది,  ధరించేది కూడా భారతీయ మహిళలే.

 సాధారణంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎన్ని క్యారెట్లని  అడుగుతుంటారు. అసలు బంగారానికి క్యారెట్లకి సంబంధం ఎంతో చూద్దాం.. మార్కెట్లో లభించే ప్రతిదానికి నాణ్యతా ఉంటుంది. బంగారం గురించి తెలిసిన వారికి 22 క్యారెట్లు, 24 క్యారెట్లు అనే పదాలు తెలిసే ఉంటాయి.

ఈ రెండింటికి తేడాలేంటో గోల్డ్ షాపింగ్ చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా తెలుస్తుంది. కానీ కొందరికి మాత్రం ఈ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది.

ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. బంగారం ఎంతో సున్నితమైంది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడానికి సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మొతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.

also read విమాన ప్రయాణికులకు విస్టారా ఎయిర్‌లైన్స్ గుడ్ న్యూస్.. టిక్కెట్లను ఇప్పుడు నేరుగా గూగుల్ లో.. ...

24 క్యారెట్ల బంగారం: ఇది 99.9 శాతం స్వచ్ఛమైంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 24 క్యారేట్ల బంగారానికి మించిన బంగారం ఉండదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం కాస్త ఖరీదైంది. 24 క్యారెట్ల బంగారం పెట్టుబడులకు ఓకేగానీ దీంతో ఆభరణాలు తయారు చేయలేం.

22 క్యారెట్ల బంగారం: ఇందులో 22 వంతుల బంగారం ఉంటే.. రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది దృడంగా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం.

18 క్యారెట్ల బంగారం: ఇందులో 18 భాగాల పసిడి ఉంటే.. ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత దృడంగా, మన్నికగా ఉంటుంది.

14 క్యారెట్ల బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. ఇది మన్నికతోపాటు ధర కూడా తక్కువ. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యమవుతుంది.

బంగారం స్వచ్ఛతను దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు డల్ గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios