గత కొన్ని వారాలుగా భారతదేశంలో వంట నూనెల ధరలో స్వల్ప తగ్గుదల ఉంది. అయితే, ఇంతలోనే కొత్త పరిణామం చోటు చేసుకుంది. దీని కారణంగా, భారతదేశంలో మరోసారి వంట నూనెలు, ప్రత్యేకమైన రిఫైన్డ్ నూనె ధరలు మరోసారి పెరుగుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది పెద్ద దెబ్బే.
గత కొన్ని వారాలుగా భారతదేశంలో వంట నూనెల ధరలో స్వల్ప తగ్గుదల ఉంది. అయితే, ఇంతలోనే కొత్త పరిణామం చోటు చేసుకుంది. దీని కారణంగా, భారతదేశంలో మరోసారి వంట నూనెలు, ప్రత్యేకమైన రిఫైన్డ్ నూనె ధరలు మరోసారి పెరుగుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది పెద్ద దెబ్బే. దేశంలో ఇటీవల పెట్రోలు-డీజిల్, పాలు, సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు పెరిగిన నేపథ్యంలో, వంట నూనె ధరల కారణంగా, ప్రజల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ కారణంగా వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉంది
ప్రభుత్వం పామాయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గించినప్పటికీ ధరలు మాత్రం తగ్గడం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇండోనేషియాలో పామాయిల్ సంక్షోభం కారణంగా, భారతదేశంలో వంట నూనెల ధరలు మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక శాతం పామాయిల్ ఉత్పత్తి చేసే ఇండోనేషియాలో పామాయిల్ కొరత ఏర్పడింది, ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తి మరియు ఎగుమతి చేసే దేశాలలో ఒకటి.
అయితే 2020లో, ఇండోనేషియా ప్రభుత్వం క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి దిగుమతులను తగ్గించడానికి డీజిల్‌లో 30 శాతం పామాయిల్ ను కలపడం తప్పనిసరి చేసింది. దీంతో బయోడీజిల్ అవసరాల కోసం పామాయిల్ ఉత్పత్తిని మళ్లించారు. దీంతో ఇండోనేషియాలో దేశీయంగా పామాయిల్ ఉత్పత్తిని 17.1 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, అందులో 7.5 మిలియన్ టన్నులు బయో డీజిల్‌కు, మిగిలిన 9.6 మిలియన్ టన్నులు గృహ, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే పామాయిల్‌ను బయో డీజిల్‌కు వేగంగా మళ్లిస్తున్నారని, దీంతో ఒక్క సారిగా ఇండోనేషియాలో ఒక్కసారిగా పామాయిల్ ధరలు చుక్కలను తాకాయి. ఫలితంగా ఇండోనేషియా ప్రభుత్వం ధరలను నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ధరల నియంత్రణ మరియు ఎగుమతులకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
ఒక సంవత్సరంలో రేటు 57% పెరిగింది
మార్చి 2021లో ఇండోనేషియాలో ఒక లీటరు బ్రాండెడ్ వంట నూనె ధర 14,000 ఇండోనేషియా రూపాయలు (IDR). ఇది మార్చి 2022లో 22,000 ఇండోనేషియా రూపాయల(IDR)కు పెరిగింది. ఈ విధంగా, దేశంలో ఒక సంవత్సరంలో 57 శాతం వంట నూనె పెరిగింది. ఫిబ్రవరి 1న, ఇండోనేషియా ప్రభుత్వం రిటైల్ ధరలకు గరిష్ట పరిమితిని విధించింది.
ఇండోనేషియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోనుంది
దేశీయ స్థాయిలో ధరల నియంత్రణతో పాటు ఎగుమతిదారులకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఎగుమతిదారులు దేశీయ మార్కెట్‌లో ప్రణాళికాబద్ధమైన సరుకుల్లో 20 శాతం విక్రయించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌కు సంబంధించిన కొరతను దృష్టిలో ఉంచుకుని దాని ఎగుమతిని నిషేధించాలని ఆలోచిస్తోంది.
భారతదేశం తన వంట నూనెల అవసరాలలో 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అదే సమయంలో మొత్తం దిగుమతి అయ్యే వంట నూనెలో పామాయిల్ వాటా 60 శాతంగా ఉంది. ఇండోనేషియా నుంచి భారత్ ఎక్కువగా పామాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. అటువంటి పరిస్థితిలో, ఇండోనేషియాలో పామాయిల్ కొరత ప్రభావం దేశీయ మార్కెట్ పై త్వరలోనే పడే అవకాశం ఉంది.
