ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాదర్ దంపతుల ఏకైక కుమార్తె, హెచ్‌సిఎల్ సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాదర్ దేశంలోని అత్యంత ధనవంతురాలైన మహిళా. హురున్ ఇండియా చేసిన సర్వే ప్రకారం, రోష్ని నాదర్ మొత్తం ఆస్తుల విలువ 54,850 కోట్ల రూపాయలు.

2020 సంవత్సరానికి కోటక్ వెల్త్ అండ్ హురున్ ఇండియా ఈ సర్వే తయారు చేశాయి. ఈ జాబితాలో రెండవ స్థానం బయోకాన్ వ్యవస్థాపకురాలు, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు.

ఆమే మొత్తం ఆస్తుల విలువ రూ.36,600 కోట్లు. ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ యుఎస్‌వి ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన లీనా గాంధీ తివారీ 21,340 కోట్ల రూపాయల ఆస్తులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. 

నివేదిక ప్రకారం, టాప్ 100 ధనవంతులైన మహిళలలో 31 మంది సొంతంగా సాధించారు. వీరిలో ఆరుగురు ప్రొఫెషనల్ మేనేజర్లు, 25 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ విభాగంలో కిరణ్ మజుందార్ షా ముందుండగా, రూ.11,590 కోట్ల నికర విలువతో జోహో కార్పొరేషన్ కు చెందిన రాధా వెంబు ఉన్నారు.

also read టాంగా నుండి ప్రారంభమై వేల కోట్ల వ్యాపారంలోకి: మసాలా కింగ్, ఎండిహెచ్ యజమాని జీవిత చరిత్ర.. ...

రోష్ని నాదర్ ఎవరు?

హెచ్‌సిఎల్ సంస్థ వ్యూహాత్మక నిర్ణయాలలో మొదటి నుంచీ ప్రధాన పాత్ర పోషించిన రోష్ని నాదర్ కేవలం 28 సంవత్సరాల వయసులో సిఇఒగా నియమితులయ్యారు. ఒక సంవత్సరం తరువాత, ఆమెను కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమించారు.

ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఇండియా ప్రకారం, 2019లో రోష్ని మొత్తం ఆస్తుల విలువ 36,800 వేల కోట్లు. 2017-2018 ఇంకా 2019 సంవత్సరాల్లో ప్రపంచంలోని ఫోర్బ్స్  100 బలమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది.  

ఢీల్లీలో స్కూల్ విద్య తరువాత, రోష్ని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రులయ్యారు. తరువాత సిఎన్‌బిసి ఛానెల్‌లో, లండన్ స్కైస్ న్యూస్‌లో పనిచేశారు.

తన తండ్రి ఆదేశానుసారం 2008లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆమే హెచ్‌సిఎల్ సంస్థలో చేరడానికి యు.ఎస్ లోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మేనేజ్మెంట్  కోర్స్ నేర్చుకుంది. అయితే హెచ్‌సిఎల్‌లో చేరే ముందు ఇతర కంపెనీల్లో కూడా ఆమే పనిచేశారు. 

2009లోనే ఆమెకు హెచ్‌సిఎల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఒగా పని చేశారు. 2013లో హెచ్‌సిఎల్ టెక్ బోర్డు అదనపు చైర్‌పర్సన్‌గా మారక ముందే రోష్ని నాదర్ హెచ్‌సిఎల్ సంస్థలో కీలకమైన నిర్ణయాల్లో పెద్ద పాత్ర పోషించేది. రోష్ని నాదర్ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్ లో వైస్ చైర్మన్.