వేదాంత సంస్థ ముందడుగు, ట్రాన్స్‌జెండర్ ఉద్యోగుల కోసం...ప్రత్యేక ఇన్‌క్లూజన్ పాలసీ ప్రారంభం..

వేదాంత లిమిటెడ్ శుక్రవారం తన ట్రాన్స్ జెండర్  ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన రిక్రూట్ మెంట్ విధానాన్ని ప్రారంభించింది. తమ సంస్థల్లో సమాన అవకాశాలను అందించడానికి, వైవిధ్య భరితమైన వాతావరణం ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ చొరవ తీసుకుందని తెలిపారు. 

Vedanta Sanstha takes a step forward, launches special inclusion policy for transgender employee MKA

ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యభరితమైన సహజ వనరుల సంస్థ వేదాంత లిమిటెడ్ శుక్రవారం తన ట్రాన్స్ జెండర్  ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన రిక్రూట్ మెంట్ విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. కార్యాలయంలో సమాన అవకాశాలను అందించడానికి, వైవిధ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో కంపెనీ ఈ చొరవ తీసుకుంది.

సమగ్ర విధానంగా, వేదాంత తన ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు 'లింగ మార్పు'కు సంబంధించిన వైద్య ప్రక్రియల కోసం 30 రోజుల సెలవును అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా ఈ శస్త్రచికిత్స కోసం ఈ ఉద్యోగులకు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది.

ట్రాన్స్ జెండర్,  శస్త్రచికిత్స అనేది స్త్రీ లేదా పురుషుడుగా మారడానికి ట్రాన్స్ జెండర్  వ్యక్తి శరీరంలో శారీరక మార్పులు చేయడం. వేదాంత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా అగర్వాల్ హెబ్బార్ మాట్లాడుతూ, “వేదాంతలో మేము వైవిధ్యానికి విలువనిచ్చే సంస్కృతిని పెంపొందించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నాము. ఈ విధంగా మేము ప్రజలందరికీ సమాన అవకాశాలను అందిస్తాము. ఈ క్రమంలో కంపెనీ కొత్త ఇన్‌క్లూజన్ పాలసీని ప్రకటించడం సంతోషంగా ఉంది.

"ఈ విధానంతో, ట్రాన్స్‌జెండర్ ఉద్యోగుల ప్రత్యేక అవసరాలు, అనుభవాలను గుర్తించడమే కాకుండా, వారి శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ఆయన చెప్పారు. కొత్త పాలసీ ప్రయోజనాలతో పాటు, నిరంతర శిక్షణ మరియు వర్క్‌షాప్‌ల ద్వారా వైవిధ్యం, చేరిక , సామాజిక బాధ్యతను ప్రోత్సహించడంలో వేదాంత గ్రూప్ ముందంజలో ఉంది. అని ఆమె తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios