Asianet News TeluguAsianet News Telugu

వాణిజ్య యుద్ధ మేఘాలు: భారత్ వైపు అమెరికన్ చమురు విక్రేతలు

ఒకవేళ అమెరికా చమురు దిగుమతులపై చైనా సుంకం విధిస్తే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ఆయిల్ ధరపై ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

US oil sellers may look to India as China tariff war escalates

న్యూఢిల్లీ: చైనా వస్తువుల దిగుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు పెంచడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా ముడి చమురు విక్రేతలు భారత్ వైపు ద్రుష్టి సారించారు. 

గత మే నెలలో అమెరికా ముడి చమురు అత్యధికంగా కొనుగోలు దేశాల్లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో అమెరికా దేశీయ ఔట్ పుట్, ఎగుమతులను సమీక్షించినప్పటి నుంచి అమెరికా ముడి చమురు కొనుగోలు దారుల్లో చైనా టాప్‌లో నిలిచింది. కానీ చైనా వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలై విక్రయాలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు. 

కమొడిటీస్ అండ్ ఎనర్జీ సంస్థ పరిశోధనా విభాగం డైరెక్టర్ శాండీ ఫీల్డెన్ మాట్లాడుతూ ‘అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలు చేయొద్దని చైనా తన రిఫైనరీలపై దిగుమతి సుంకాలు విధిస్తే దాని ధర మరింత పెరుగుతుంది. కనుక అమెరికా ముడి చమురు విక్రేతలు తమ ముడి చమురు విక్రయానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది’ అని చెప్పారు.

అమెరికా ఆయిల్‌పై చైనా దిగుమతి సుంకం విధించడం వల్ల వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్, దాని బ్రెంట్ ఆయిల్ ధరపై ప్రభావం పడుతుంని ఫీల్డెన్ చెప్పారు. తత్ఫలితంగా అమెరికా ముడి చమురు విక్రేతలు భారత్‌కు మరింత ముడి చమురు అమ్మే దిశగా చర్యలు చేపట్టవచ్చునన్నారు.

ఇరాన్ నుంచి సరఫరా అయ్యే ముడి చమురులో అత్యధికంగా సల్ఫర్ ఉంటుంది. ఇరాన్ ముడి చమురు దిగుమతులపై ఇప్పటికే ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీనికి తోడు దీన్ని భారతీయ రిఫైనరీ ఆయిల్ సంస్థలు ప్రాసెస్ చేయడం చాలా భారంగా మారుతుంది. అమెరికా ముడి చమురులో అతి తక్కువ సల్ఫర్ ఉండటం వల్ల దాని ప్రాసెస్ తేలికవుతుంది. 

అయితే ఇరాన్ ముడి చమురుకు షెల్ క్రూడ్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని కమొడిటీస్ అండ్ ఎనర్జీ సంస్థ పరిశోధనా విభాగం డైరెక్టర్ శాండీ ఫీల్డెన్ పేర్కొన్నారు. భారత రిఫైనరీ సంస్థలు పూర్తిగా అమెరికా ముడి చమురునే వినియోగించవు. దీన్ని చైనాకు అమ్ముకోవచ్చు. అంతకుముందు భారత రిఫైనరీ సంస్థలు దిగుమతి చేసుకుని ప్రాసెస్ చేస్తాయని పీల్డెన్ వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios