అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

US-Canada Trade War: Canada retaliates with $12.6B tariffs on US goods
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో తమ నిరసనలను వినిపిస్తున్నాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో తమ నిరసనలను వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. చర్యకు ప్రతిచర్యగా అమెరికా పన్ను విధానాలను తిప్పికొట్టేందుకు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి.

తాజాగా.. పొరుగు దేశాలైన అమెరికా, కెనడాల విషయంలో కూడా ఇదే తరహా ట్రేడ్ వార్ జరుగుతోంది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలను విధించడంతో, కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లను విధించింది. కెనడియన్‌ స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ కార్యాలయం విధించిన డ్యూటీలకు ప్రతిగా, అమెరికా దిగుమతులపై సుంకాలను విధిస్తున్నట్టు కెనడా తాజాగా ప్రకటించింది. 

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం సుంకాల విధించే ఉత్పత్తుల సంబంధించిన తుది జాబితాను గడచిన శుక్రవారం నాడు విడుదల చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని కెనడా సర్కారు పేర్కొంది. వివిధ ఉత్పతుల బట్టి పన్నులు అధనంగా 10 శాతం నుంచి 25 శాతం వరకూ పెరిగాయి.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఫ్లోరిడా ఆరెంజ్ జ్యూస్, కెచప్‌, కెంటుకీ బోర్బోన్‌ విస్కీ, విస్కాన్‌సిన్‌ టాయిలెట్‌ పేపర్‌, లోహాలు తదితర వస్తువులపై సుంకాలు పెంచుతున్నట్టు కెనడా తెలియజేసింది. ఇవే కాకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సుమారు 250 ఉత్పత్తులపై కెనడా ప్రభుత్వం సుంకాలు విధించింది. అమెరికాలో నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌ మద్దతుదారులపై ఒత్తిడి పెంచేందుకు కెనడా ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

కెనడా అమెరికాపై మొత్తం 12.6 బిలియన్‌ డాలర్ల సుంకాలను విధించింది. ఒకవేళ డొనాల్డ్‌ ట్రంప్‌ తమతో వాణిజ్య యుద్ధానికి తెరలేపితే, దానికి కూడా సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రకటించింది. కెనడా ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైన ఆటోరంగానికి సంబంధించిన విడిభాగాలపై అమెరికా టారిఫ్‌లు విధించడంపై కెనడాఎక్కువగా ఆందోళన చెందుతోంది. అమెరికాలో తయారయ్యే కార్ల విభాగాలను కెనడాలోనే తయారు చేస్తారు. వీటి ఫలితంగానే అమెరికా ఉత్పత్తులపై కెనడా బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధించింది.

 

loader