ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ దుర్వినియోగం చేసే శక్తులకు అడ్డుకట్ట వేస్తాం..కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ప్రవేశపెట్టబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారత దేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తుందని. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేసే శక్తులను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలను రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Union Minister Rajeev Chandrasekhar's announcement will stop the forces that abuse artificial intelligence MKA

గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో సరికొత్త విప్లవం సృష్టిస్తోంది.  ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో  పనితీరును వేగవంతంగా చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అలాగే రోజువారి జీవితంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ కామర్స్ రంగంలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కారణంగా వ్యాపారం భారీగా పెరుగుతుంది.  అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో ఎన్ని లాభాలు ఉన్నాయో,  ఏఐ టెక్నాలజీని   దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. . దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించేందుకు సిద్ధం అవుతుంది.  ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీడియాతో పంచుకున్నారు.

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన తొమ్మిదేళ్లుగా ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం సాంకేతికంగా ఎంతో పురోగతి సాధిస్తుందని,  డిజిటల్ ఇండియా కల సహకారం అవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని  దుర్వినియోగం చేయకుండా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టబోతోందని ఆయన ప్రకటించారు.  ముఖ్యంగా డిజిటల్ సిటిజన్స్ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోందని ఆయన పేర్కొన్నారు. 

 ఇంటర్నెట్ ఉపయోగం  విస్తృతి పెరిగేకొద్దీ  సైబర్ నేరాలు అదేవిధంగా మోసాలు పెరుగుతున్నాయని వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అంతేకాదు ఇంటర్నెట్ను దుర్వినియోగం చేసే వారిని ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. 

 ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దాదాపు 85 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని గణాంకాలను తెలిపారు.  అయితే ఈ సంఖ్య 2025 నాటికి 120 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని, అందుకే రాష్ట్రాల సహకారంతో త్వరలోనే ప్రభావంతమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 

కాబోయే నెలలో డిజిటల్ ఇండియా బిల్ ప్రవేశపెట్టబడుతున్నట్టు రాజీవ్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు దీనికి సంబంధించి టెక్నాలజీ విభాగాలకు చెందిన పలు స్టేట్ హోల్డర్స్ తో సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ తాజాగా భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సృష్టించబోయే అవకాశాలను ప్రధాని నరేంద్ర మోడీకి ఆల్ట్ మెన్ వివరించారు. అలాగే ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో నూతన అవకాశాలకు ఉపాధి మార్గాలకు వారధి అవుతుందని శ్యామ్ ఆల్ట్మన్ వివరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios