Union Budget 2023: బడ్జెట్ కు ముందు ఈ 10 స్టాక్స్ పై ఓ లుక్కేయండి, ఫిబ్రవరి 1 తర్వాత రేసుగుర్రాలు అయ్యే అవకాశం

2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమర్పణకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది . స్టాక్ మార్కెట్ అదృష్టాన్ని నిర్ణయించడంలో యూనియన్ బడ్జెట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Union Budget 2023: Take a look at these 10 stocks ahead of the Budget, likely to become racehorses after February 1 MKA

స్టాక్ మార్కెట్‌లోని ఇన్వెస్టర్లు రాబోయే బడ్జెట్‌లో కొన్ని సంస్కరణలు, ఆర్థిక విధానాలలో మార్పులను ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా, బడ్జెట్‌కు ముందు మీరు  వ్యూహాత్మక పెట్టుబడి కోసం ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సూచించిన ఈ 10 స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. 

ఇన్ ఫ్రా స్ట్రక్చర్ రంగంలో ఈ స్టాక్స్ పై లుక్కేయండి…
దేశంలోని మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ కారణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని కొన్ని స్టాక్ లు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టాక్‌లపై ఇన్వెస్టర్లు బుల్లిష్ గా ఉన్నారు. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్‌ను పెట్టుబడి పెట్టేందుకు కోసం సిఫార్సు చేసేందుకు రెండు ప్రముఖ బ్రోకరేజీలు ముందుకు వచ్చాయి.

దీంతో పాటు, ఉపరితల రవాణా అభివృద్ధికి మరింత ప్రాముఖ్యత లభిస్తుందని భావిస్తున్నారు. రోజుకు కనీసం రోజుకు 50 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలన్న ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లక్ష్యానికి ఆసరాగా బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 'పిఎన్‌సి ఇన్‌ఫ్రాటెక్' స్టాక్‌ను 20 బ్రోకరేజ్ సంస్థలు , 'కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్' స్టాక్‌ను 22 బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేశాయి.

రక్షణ రంగంలోని ఈ స్టాక్స్ పై ఓ లుక్కేయండి..

స్వదేశీ ఆయుధాల తయారీకి ప్రభుత్వం నుండి ఇప్పటికే లభించిన మంచి ఒప్పందాలు , బలమైన ప్రోత్సాహకాలతో ఈసారి రక్షణ రంగ స్టాక్‌లు కూడా దృష్టి సారించాయి. అలాగే, స్వదేశీ ఆయుధాల తయారీని పెంచేందుకు బడ్జెట్‌లో ఆశించిన మరిన్ని ప్రకటనలు చాలా మంది ఫండ్ మేనేజర్ల దృష్టిని డిఫెన్స్ స్టాక్‌ల వైపు ఆకర్షించాయి. 'హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్' (HAL)- 9 ప్రముఖ బ్రోకరేజీలచే సిఫార్సు చేయబడింది. అదేవిధంగా, PSU 'భారత్ డైనమిక్స్' స్టాక్‌ను 7 బ్రోకరేజ్ సంస్థలు , 'భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్' (BHEL) స్టాక్‌ను 5 బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేశాయి.

ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ఓ లుక్కేయండి..
కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ఉపసంహరణకు సంబంధించిన ప్రకటనలను కూడా మార్కెట్ ఆశించింది. దీనితో పాటు మరిన్ని కంపెనీల షేర్లను విక్రయించే అవకాశాలను, షెడ్యూల్‌ను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, బ్రోకరేజ్ సంస్థలు పెట్టుబడి కోసం 'BEML', 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (SCL) , 'కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (CONCOR) షేర్లను సిఫార్సు చేశాయి.

గ్రీన్ ఎనర్జీ సంస్థలపై ఓ లుక్కేయండి..
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునే ప్రయత్నాలు భారతదేశంలో విస్తృతంగా మారుతున్నాయి. 2030 నాటికి సంప్రదాయ ఇంధనాల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనంలో 65 శాతానికి పైగా పునరుత్పాదక వనరుల నుంచి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగానే ప్రణాళికలు, ప్రకటనలు రానున్న కేంద్ర బడ్జెట్‌లో కూడా రానున్నాయి. దీని లక్ష్యంతో 10 బ్రోకరేజీ సంస్థలు 'టాటా పవర్' స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేశాయి.

(నోట్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో, ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు, ఆర్థిక నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోవాలి.)
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios