నీరవ్ మోడీ విషయంలో బ్రిటన్ కోర్టులో భారత్ విజయం సాధించింది. నీరవ్ మోడీని భారత్ పంపేందుకు యూకే కోర్టు అనుమతించింది. విచారణ సందర్భంగా నీరవ్ మోడీ వాదనలను బ్రిటన్ కోర్టు కొట్టేసింది. రూ.14 వేల కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్‌పై ఆరోపణలు వున్న సంగతి తెలిసిందే. 

నీరవ్ మోడీపై మనీలాండరింగ్ రుజువైంది. అలాగే భోగస్ కంపెనీల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు భారత ప్రభుత్వం ఆధారాలు సమర్పించింది. భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలన్నీ సరైనవేనని లండన్ కోర్టు తెలిపింది.

నీరవ్ మోడీ నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ వున్నాయని న్యాయస్థానం పేర్కొంది. అయితే భారత్‌తో తనకు న్యాయం జరగదన్న నీరవ్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అలాగే నీరవ్‌పై కేసు నమోదుకు ఆమోదించింది. పై కోర్టుకు వెళ్లడానికి నీరవ్‌కు అవకాశం కల్పించింది. బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం కోరే అవకాశాలు ఇచ్చింది.