మస్క్ అన్నంత పని చేసేశాడు...ట్విట్టర్ నుంచి తుర్రుమన్న బ్లూ పిట్ట...ఇకపై X లోగోతో ట్విట్టర్ రీ బ్రాండింగ్..
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అనుకున్నంత పని చేసేసాడు. తన సంస్థ లోగో నుంచి నీలిరంగు పెట్టాను ఎగరగొట్టి ఆస్థానంలో ఎక్స్ పేరిట కొత్త లోగోను ప్రవేశపెట్టాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి, దానికి X అని కొత్త లోగోను ప్రకటించారు. దీని గురించి సమాచారాన్ని పంచుకుంటూ, ఎలాన్ మస్క్ ట్వీట్ చేస్తూ, "నిజంగా చెప్పాలంటే, నేను ఈ ప్లాట్‌ఫారమ్‌పై నెగిటివ్ రివ్యూలను ఇష్టపడుతున్నాను. కొన్ని సెన్సార్‌షిప్ బ్యూరోల కంటే ఇది చాలా మెరుగ్గా ఉంది. త్వరలో మేము ట్విట్టర్ బ్రాండ్‌కి, నెమ్మదిగా అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతాము" అని ట్వీట్ చేశారు.
విశేషమేమిటంటే, ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొత్త యజమాని అయినప్పటి నుండి, అతను కంపెనీలో అనేక మార్పులు చేసాడు. వివిధ సమయాల్లో, ఎలాన్ మస్క్ తన మార్పుల ద్వారా యూజర్లను కూడా ఆశ్చర్యపరిచాడు. X లోగో పోస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాం అని మస్క్ ఇప్పటికే తెలిపారు. ఎలాన్ మస్క్ నలుపు బ్యాక్ గ్రౌండ్ తో X అనే అక్షరాన్ని ఫైనల్ లోగోగా మార్చారు.
Twitter CEO లిండా యాకారినో కూడా ప్లాట్‌ఫారమ్ X గురించి ట్వీట్ చేస్తూ, కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై "పెద్ద ముద్ర వేయడానికి రెండవ అవకాశం" అని పేర్కొన్నారు. లిండా అధికారికంగా X లోగోని పరిచయం చేశారు. ట్విటర్ ఇఫ్పటికే థ్రెడ్ ప్లాట్‌ఫారమ్‌తో పోటీ పడుతోంది. అందుకే ట్విట్టర్ లోగోను మారుస్తూ X పేరిట కొత్త రూపును ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది తమ సంస్థకు రెండవ అతిపెద్ద అవకాశంగా అభివర్ణిస్తూ, "జీవితంలో లేదా వ్యాపారంలో మీరు మరొక పెద్ద మార్పు చేందడానికి రెండవ అవకాశం పొందడం అవసరం. Twitter సోషల్ మీడియా ప్రపంచంలో భారీ ప్రభావాన్ని చూపింది. మేము కమ్యూనికేట్ చేసే విధానాన్ని మార్చబోతున్నాము. ఇప్పుడు, X ప్రపంచ సోషల్ మీడియా రంగాన్ని మరింత మార్చడానికి కొనసాగుతుంది." అని ఆమె తెలిపారు.
ట్విట్టర్ సంస్థను టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి మేము చేసిన భారీ మార్పుల్లో X రీబ్రాండింగ్ కూడా కీలకం అని CEO వెల్లడించారు. మేము గత 8 నెలలుగా చాలా రకాల ఫీచర్ లాంచ్‌ల ద్వారా ట్విట్టర్ కొత్త రూపం సంతరించుకుంటుందని. అందులో భాగంగానే X లోగో రీ బ్రాండింగ్ చేశామని. సంస్థను రీస్టార్ట్ చేసేందుకు ఇది సరైన అవకాశం అని ఆమె పేర్కొన్నారు.
X అంటి సర్వస్యం అని అర్థం అని, అంతులేనిది అనే అర్థం కూడా వస్తుందని అని చెప్పి ట్వీట్ ముగించారు. X ని ప్రపంచానికి తీసుకురావడానికి ట్విట్టర్ తన భాగస్వాములతో కలిసి పనిచేస్తోందని ఆమె తెలిపారు.
ఇంతకు ముందు కూడా, ఎలాన్ మస్క్ ఇలాంటి అనేక మార్పులు చేసారు, దీని కారణంగా యూజర్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. అతను చేసిన మార్పులో అతిపెద్ద మార్పు బ్లూ కలర్ టిక్ తొలగించడం. దాని స్థానంలో, గోల్డెన్, గ్రే మొదలైన రంగుల టిక్‌లను జారీ చేశాడు. అలాగే బ్లూటిక్ కోసం పెయిడ్ సర్వీస్ కూడా ప్రారంభించాడు.