Twitter X: అయ్యో ట్విట్టర్...మస్క్ చేసిన ఈ పనితో ఓ బూతు వెబ్‌సైట్ పంట పండింది...నెట్టింట పేలుతున్న జోకులు
ట్విట్టర్ పేరు X గా మారినప్పటి నుంచి సడన్ గా ఓ అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్ ట్రెండింగ్ గా మారింది. చాలామంది యూజర్లు ఈ అడల్ట్ కంటెంట్ వెబ్సైట్ను తాజా ట్విట్టర్ X లోగోను జత చేస్తూ నెట్టింట జోకులు పేల్చుతున్నారు. అసలు ఈ అడల్ట్ కంటెంట్ సైట్ కి ట్విట్టర్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం.
ట్విట్టర్ లోగో ఇప్పుడు ‘X’గా మారి ఎన్నో ఏళ్లుగా ఉన్న నీలి పక్షి కనిపించకుండా పోయింది. దీనితో పాటు, ట్విట్టర్ పేరు కూడా X గా మారిపోయింది. మస్క్ ఆదివారం వరుస ట్వీట్లతో ఈ మార్పును సూచించడం ప్రారంభించాడు. "త్వరలో మేము ట్విట్టర్ రీ బ్రాండ్ చేస్తాం, నెమ్మదిగా అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతాము" అని ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు ప్లాట్‌ఫారమ్ వెబ్ వెర్షన్‌లో బ్లూ పిట్ట స్థానంలో 'X' లోగో వచ్చింది.
మస్క్ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న లోగోతో పాటు కంపెనీ అధికారిక ఖాతా పేరును 'X'గా మార్చారు. అతను కొత్త లోగోను ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ట్విట్టర్ సీఈఓ లిండా యాకారినో సోమవారం మాట్లాడుతూ, 'ఇది అనూహ్యంగా అరుదైన విషయం - జీవితంలో లేదా వ్యాపారంలో - మీరు పెద్ద ముద్ర వేయడానికి రెండవ అవకాశం పొందుతారు. Twitter మనందరం కమ్యూనికేట్ చేసే విధానాన్ని మార్చింది. ఇప్పుడు, X గ్లోబల్ సిటీ క్లాస్‌ని మారుస్తుంది. యాకారినో ప్రకారం, X అనేది "ఆడియో, వీడియో, మెసేజింగ్, పేమెంట్/బ్యాంకింగ్"లో కేంద్రీకృతమై ఉన్న "అపరిమిత ఇంటరాక్టివిటీ కి చిహ్నంగా పేర్కొన్నారు."
ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఎక్స్ లోగో ద్వారా ట్విట్టర్ తన కొత్త రూపం సంతరించుకుందో అప్పటినుంచి ప్రముఖ అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్ #xvideos సైట్ సైతం ట్రెండింగ్‌ను ప్రారంభించింది, మస్క్ లోగోకు X అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్న వెంటనే, చాలా పోర్న్ సైట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్ ప్రారంభించాయి. వాస్తవానికి, చాలా పోర్న్ సైట్‌లు Xతో ప్రారంభమవుతాయి. చాలామంది యూజర్లు డెస్క్ టాప్ ద్వారా ట్విట్టర్ను ఓపెన్ చేయాలంటే గూగుల్ లోకి వెళ్లి ట్విట్టర్ అని సెర్చ్ చేసేవారు. కానీ ఇకపై X అక్షరం కొట్టి సెర్చ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సెర్చ్ ఇంజన్లో పోర్న్ సైట్ లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఈ ట్రెండింగ్ మొదలైంది. గత ఒక్కరోజులోనే ప్రముఖ అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్ Xvideos వెబ్ ట్రాఫిక్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. గంటకు 3 వేల యూజర్ల ట్రాఫిక్ ఉండే ఈ అడల్ట్ కంటెంట్ వెబ్సైట్, ఆదివారం ఒక్కసారిగా గంటకు 10 లక్షల యూజర్లకు పెరిగింది. దీంతో సదరు వెబ్సైట్ పంట పండిందని నెట్టింట జోకులు పేలుతున్నాయి.
నిజానికి ఎలాంటి ట్విట్టర్ విషయంలో ఏ మార్పు చేసిన ఇప్పటివరకు ఇలాగే బూమరాంగ్ అవుతున్నాయి. గతంలో పెయిడ్ బ్లూటిక్ సర్వీస్ ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే బూమరాంగ్ అయింది. ఎందుకంటే కొంతమంది తుంటరి యూజర్లు, ప్రముఖ సంస్థల పేర్లతో అకౌంట్లను ఓపెన్ చేసి, డబ్బులు పెట్టి బ్లూటిక్ కొనుగోలు చేసి ఆయా సంస్థలకు భారీ నష్టం వచ్చేలా కొన్ని తుంటరి పనులు చేశారు. దీంతో అప్పట్లో బ్లూటిక్ సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ పేరు మార్పు కూడా అలాంటి కోవలోకే చెందుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.