Twitter Deal: ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిచిపోవడంతో ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్, వరుస ట్వీట్లను సంధిస్తున్నారు. తనను లేమ్ డక్ సీఈఓ అనే వాళ్లకు జవాబు ఇస్తున్నారు. మస్క్ ట్విటర్ డీల్ పై అసంతృప్తితో ఉన్న పరాగ్, ప్రస్తుతం డీల్ నిలిపివేతతో ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు.

Twitter Deal: టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత టెక్ ప్రపంచంలో సంచలనానికి తెర లేపింది. ఈ పరిణామాలపై ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ వరుస ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చుతున్నారు. అంతేకాదు మొత్తం సంఘటన గురించి పేర్కొంటూ, అగర్వాల్ ఇలా ట్వీట్ చేశారు. గత కొన్ని వారాల్లో చాలా జరిగిందని, కానీ నేను కంపెనీ వృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించాను, ఈ మధ్యకాలంలో పెద్దగా బహిరంగంగా ఏది మాట్లాడలేకపోయాను, కానీ ఇప్పుడు నేను నా అభిప్రాయం చెప్పి తీరుతాను అంటూ పేర్కొన్నారు.

Scroll to load tweet…

అంతేకాదు మరో ట్వీట్ లో పరాగ్ కాస్త దూకుడును ప్రదర్శించారు. ఈ ట్వీట్ లో -: మేము నిన్నటి నుంచి మా నాయకత్వ బృందం, కార్యకలాపాల్లో మార్పులను ప్రకటించాము. కొన్ని మార్పులు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి. కాని కొంత మంది నన్ను అడుగుతున్నారు. "Lame duck" CEO ఈ మార్పులు ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు. కానీ దానికి సమాధానం చాలా సులభం అంటూ పేర్కొన్నారు.

Scroll to load tweet…

అంతేకాదు వరుస ట్వీట్లలో ట్విట్టర్‌ని నడిపించడం, నిర్వహించడం నా బాధ్యత అని, ప్రతిరోజూ బలమైన ట్విట్టర్‌ను నిర్మించడమే మా పని అని పరాగ్ అన్నారు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటానని పరాగ్ అగర్వాల్ అన్నారు. సంస్థ మంచి భవిష్యత్తు కోసం మీరు మరిన్ని మార్పులు చూడాలని ఆయన అన్నారు. అలాగే ట్విటర్‌ను నిర్వహించడం తన బాధ్యత అని పరాగ్ అగర్వాల్ అన్నారు.

ట్విట్టర్‌ని మరింత బలోపేతం చేయడమే నా పని

మరో ట్వీట్‌లో, భవిష్యత్తులో ట్విట్టర్ ఏ కంపెనీగా మారినప్పటికీ, అది ఒక ఉత్పత్తిగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ట్విట్టర్, ఎలోన్ మస్క్ మధ్య ఒప్పందం తర్వాత, కంపెనీ ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కేవోన్ బేక్‌పూర్ మరియు బ్రూస్ ఫాల్క్‌లను తొలగించింది.

అలాగే ఏ ట్విటర్ ఉద్యోగి కేవలం ఫార్మాలిటీ కోసం పని చేయరని, మా పని పట్ల గర్విస్తున్నామని అగర్వాల్ స్పష్టం చేశారు. కంపెనీ భవిష్యత్తు యాజమాన్యంతో సంబంధం లేకుండా, కస్టమర్‌లు, భాగస్వాములు, షేర్‌హోల్డర్‌ల ప్రయోజనాల కోసం Twitterని మెరుగుపరచడానికి మేము ఇక్కడ ఉన్నామని ఆయన తెలిపారు.

కాగా అగర్వాల్ చేసిన ఈ ప్రకటనలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తున్నారు. దీనికి కారణం ఎలోన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశారన్న వార్త తర్వాత పరాగ్ అగర్వాల్ ట్విట్టర్‌ను విడిచిపెట్టాల్సి ఉంటుందని అంతా భావించారు. కానీ, ఇప్పట్లో అది జరిగే అవకాశం లేదని ఆయన ట్వీట్‌ ల సారాంశాన్ని బట్టి అర్థం అవుతోంది.

భారతీయుడైన పరాగ్ అగర్వాల్ ఇటీవలే ట్విట్టర్ బాధ్యతలు స్వీకరించారు. పరాగ్ స్వస్థలం రాజస్థాన్‌లోని అజ్మీర్‌. ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. అతను 2011లో ట్విట్టర్‌లో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు.