Top SUVs in India: ఈ ఎస్‌యూవీ కార్ల కోసం జనాలు పోటీపడుతున్నారు. టాప్ 5 మోడల్స్ ఇవే
Top SUVs in India: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి నెలలో అమ్మకాల గణాంకాల చూస్తే ఇదే అర్థమవుతుంది. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎస్‌యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనదేశంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్లో అమ్ముడవుతున్న కార్ల గణాంకాలు పరిశీలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీల నుంచి పూర్తి స్థాయి ప్రీమియం కార్ల వరకు ధరలతో సంబంధం లేకుండా కార్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.
మారుతి బ్రెజ్జా
దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో మారుతి బ్రెజ్జా ఒకటి. ఫిబ్రవరి నెలలో 15,392 కార్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయానికి 17,517 కార్లు అమ్ముడయ్యాయి. ఇది వార్షిక అమ్మకాల్లో రెండు శాతం క్షీణతను చూపించింది.
బ్రెజ్జా ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమై రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.5 లీటర్, కె15సి పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది 103 బిహెచ్‌పి పవర్‌ను, 137 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.
మారుతి ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫిబ్రవరి నెలలోనే భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా మారింది. గత సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీ 14,168 కార్లు అమ్మింది. ఈ ఏడాది ఏకంగా అమ్మకాల వృద్ధి 51 శాతంగా నమోదైంది. మారుతి ఫ్రాంక్స్ బేసిక్ వేరియంట్ రూ.7.52 లక్షలకు అందుబాటులో ఉంది. అదే హై ట్రిమ్ అయితే రూ.13.03 లక్షలకు లభిస్తుంది.
టాటా పంచ్
రూ.6.20 లక్షల నుంచి రూ.10.32 లక్షల ధర మధ్యలో లభించే భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ టాటా పంచ్. టాటా కంపెనీ గత సంవత్సరం ఇదే నెలలో 18,438 యూనిట్లు అమ్మగా, ఈసారి 14,559 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఇది వార్షిక అమ్మకాల్లో 21 శాతం క్షీణతను చూపిస్తుంది. పంచ్ 86bhp, 1.2L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో మాన్యువల్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్స్ కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా
ఫిబ్రవరి 2025లో 15,276 యూనిట్లు అమ్మిన హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయనే చెప్పొచ్చు. గత సంవత్సరం ఇదే నెలలో 16,317 యూనిట్లు అమ్మగా ఈ ఫిబ్రవరిలో 7 శాతం తగ్గాయి. ప్రస్తుతం దీని ధర రూ.11.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉంది. ఎస్‌యూవీ ఐసిఈ వెర్షన్ 160 బిహెచ్‌పి, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 115 బిహెచ్‌పి, 1.5 లీటర్ పెట్రోల్, 116 బిహెచ్‌పి, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ రూ.17.99 లక్షల నుంచి రూ.23.50 లక్షల ధర పరిధిలో లభిస్తుంది.
టాటా నెక్సాన్
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల జాబితాలో టాటా మోటార్స్ నెక్సాన్ టాప్ లో ఉంది. టాటా కంపెనీ 2024 ఫిబ్రవరిలో 15,765 నెక్సాన్ కార్లు అమ్మగా, ఈ ఫిబ్రవరిలో 15,349 విక్రయించారు. అంటే వార్షిక అమ్మకాల్లో 2 శాతం తగ్గిందన్న మాట. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 120bhp, 1.2L టర్బో పెట్రోల్, 115bhp, 1.5L డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవెల్ వేరియంట్ ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభం కాగా, టాప్ వేరియంట్‌కు రూ.15.60 లక్షల వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చౌకైన బైక్ ఇదే. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు

