బంగారం వెండి ధరలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్స్  10 గ్రాములకి 0.33 శాతం పెరిగి 53,449 రూపాయల వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబరు సిల్వర్ ఫ్యూచర్స్ వెండి ధర 1.2 శాతం పెరిగి కిలోకు రూ .70,029 వద్ద ట్రేడవుతోంది.

స్పాట్ బంగారం ఔన్స్‌కు  రూ.1,987.51 వద్ద ట్రేడవుతోంది. డాలర్ క్షీణించి వారానికి పైగా కనిష్టానికి చేరింది. 10 గ్రాములకు 53,300 రూపాయల ఉన్న బంగారం ధర 53,600-53,700 స్థాయిల వరకు విస్తరించవచ్చని నిపుణులు అంటున్నారు.

also read బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్‌... ...

సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1048 ఎగిసి రూ. 53,275 వద్ద నిలిచింది. ఇక వెండి కేజీ ధర రూ. 1,984 పెరిగి రూ. 69,155 వద్ద స్థిరపడింది. సోమవారం గోల్డ్ ఫ్యూచర్స్‌, స్పాట్‌ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పురోగమించాయి.

గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్‌ ధర 2 శాతం ఎగిసి 1998 డాలర్ల వద్ద నిలవగా స్పాట్‌ బంగారం 1985 డాలర్ల ఎగువన ముగిసింది. డాలర్ సూచీ బలహీనత, యుఎస్ 10 సంవత్సరాల బాండ్ దిగుబడి మధ్య ఆగస్టు 17న బంగారం, వెండి ధరలు పెరిగాయి.

ట్రాయ్ ఔన్స్‌కు బంగారం 2.5 శాతం పెరిగి 1,998.70 డాలర్ల వద్ద స్థిరపడింది, సిల్వర్ మళ్లీ 6 శాతం లాభపడి ట్రాయ్ ఔన్స్‌కు 27.67 డాలర్ల వద్ద స్థిరపడింది. ఎంసిఎక్స్‌లో బంగారం 1.98 శాతం లాభాలతో రూ .53,260 వద్ద ఉండగా, వెండి 2.59 శాతం పెరిగి రూ .68,912 వద్ద నిలిచింది.