Asianet News TeluguAsianet News Telugu

3 రోజుల విరామం తరువాత నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు ఎంతంటే ?

 నేడు డీజిల్ ధర 15 నుంచి 16 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర 24 నుంచి 25 పైసలకు పెరిగింది. ఢీల్లీ, ముంబై నగరాలలో పెట్రోల్ ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  

todays fuel price: petrol and diesel price hiked after 3 days break
Author
Hyderabad, First Published Feb 27, 2021, 11:11 AM IST

ఇంధన ధరలు మూడు రోజుల విరామం తరువాత పెట్రోల్, డీజిల్ ధరలను నేడు రాష్ట్ర చమురు కంపెనీలు మళ్ళీ పెంచాయి. నేడు డీజిల్ ధర 15 నుంచి 16 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర 24 నుంచి 25 పైసలకు పెరిగింది. 

ఢీల్లీ, ముంబై నగరాలలో పెట్రోల్ ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  ఇప్పుడు ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .91.17 కాగా, డీజిల్ ధర రూ .81.47 కు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర రూ .97.57 కు, డీజిల్ ధర లీటరుకు రూ .88.60 కి చేరుకుంది.  

నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి
  
నగరం                    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ                        81.47    91.17
కోల్‌కతా                  84.35    91.35
ముంబై                   88.60    97.57
చెన్నై                     86.45     93.11

హైదరాబాద్           86.85     94.54 

also read స్టాక్ మార్కెట్ విజృంభణ: నేడు 51 వేలకు పైన మిగిసిన సెన్సెక్స్.. ...

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర  జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు సావరిస్తాయి.

 పెట్రోల్, డీజిల్‌ ధరల విషయంలో పన్ను తగ్గింపునకు కేంద్ర, రాష్ట్రాల  సమన్వయ చర్య అవసరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గురువారం పేర్కొన్నారు. తగ్గింపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదాయ పరమైన ఒత్తిడులు ఉన్న విషయాన్నీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనడంసహా, పలు అభివృద్ధి కార్యకలాపాలకు ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొంబాయి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వాల రెవెన్యూ ఇబ్బందులు ఒత్తిడులను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంపై ప్రతికూలత చూపుతుంది’’ అని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios