మూడు రోజుల తరువాత నేడు వారంలోని  చివరి ట్రేడింగ్ రోజు  శుక్రవారం స్టాక్ మార్కెట్  నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 487.43 పాయింట్లతో 0.97 శాతం క్షీణించి 50792.08 వద్ద ముగిసింది.

మరోవైపు  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 15030.95 స్థాయి వద్ద  143.85 పాయింట్లు అంటే 0.95 శాతం నష్టంతో  ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ మూసివేసిన  సంగతి మీకు తెలిసిందే. అంతకుముందు సెన్సెక్స్ 1,305.33 పాయింట్లతో  అంటే 2.65 శాతం లాభపడింది.

 దేశంలో కరోనా వైరస్ కేసుల దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా నేడు  రాత్రి 8 గంటల నుండి మహారాష్ట్రలోని అకోలాలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు. గత 24 గంటల్లో 23,000 కరోనా కేసులు నమోదయ్యాయి.

also read రేపటి నుండి బ్యాంకుల మూసివేత.. మార్చి 15 నుండి మొగనున్న సమ్మే సైరెన్.. ...

గత కొద్ది రోజులుగా కరోనా  రోజువారీ కేసులలో ఇది అతిపెద్ద సంఖ్య. నేడు యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా క్షీణించాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ఇండెక్స్ కూడా 2.3 శాతం బాగా క్షీణించింది.  

 నేడు బిపిసిఎల్, పవర్ గ్రిడ్, ఐఒసి, జెఎస్డబ్ల్యు స్టీల్, టైటాన్ షేర్లు లాభాలతో మూగిసాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, హిండాల్కో, ఎస్‌బిఐ లైఫ్ షేర్లు నష్టాలతో  ముగిశాయి. 

స్టాక్ మార్కెట్ బుధవారం వారం లోని మూడవ రోజున కూడా వరుసగా ఊపందుకుంది. సానుకూల ధోరణి మధ్య ఔషధ, ఐటి, ఆటోమొబైల్  కంపెనీలు స్టాక్స్ మార్కెట్లో బలాన్ని సాధించాయి.

30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 254.03 పాయింట్లుతో 0.50 శాతం పెరిగి 51,279.51 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 76.40 పాయింట్లతో 0.51 శాతం పెరిగి 15,174.80 వద్ద ముగిసింది.