రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నేటికి ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ యుద్ధం ప్రపంచ వాణిజ్యానికి దెబ్బ తీసినప్పటికీ, మోదీ ప్రభుత్వం తీసుకున్న తెలివైన నిర్ణయాల కారణంగా మన దేశానికి బాగా కలిసివచ్చింది. అది ఎలాగో తెలుసుకుందాం.
కరోనా తర్వాత ఆర్థిక రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సమస్య అయినటువంటి రష్యా ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. రష్యా సాయుధ పలగాలు ఉక్రెయిన్ ను చుట్టుముట్టి రోజుల వ్యవధిలోనే యుద్ధాన్ని ముగిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఉక్రెయిన్ బలంగానే ప్రతిఘటిస్తూ రష్యా సేనలను నిలవరిస్తోంది. ఈ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి ఏడాది పూర్తయింది అయినప్పటికీ టెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. .
ఉక్రెయిన్, రష్యాల మధ్య ఈ యుద్ధం కారణంగా సంక్షోభం ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి రష్యా ఉక్రేయుధం గొడ్డలి పెట్టు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరుదేశాల యుద్ధం కారణంగా ప్రధానంగా సప్లై చెయిన్ దెబ్బతిన్నది. అటు రష్యాపై కూడా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నాటో దేశాలు పలు నిషేధాలను ఆంక్షలను విధించటంతో, ప్రపంచ వాణిజ్యానికి దెబ్బ తగిలింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో రష్యా ఉక్రెయిన్ వాటా భారీగా ఉంది. ముఖ్యంగా. చమురు, గ్యాస్, సన్ ఫ్లవర్ నూనె, అలాగే పలు విలువైన ఖనిజాలు రష్యా ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుంటాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా రష్యాతో చాలా దేశాలు వాణిజ్యాన్ని నిలిపివేశాయి. ఫలితంగా అంతర్జాతీయంగా పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత్ కు ఎలా కలిసి వచ్చింది..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అవగానే అమెరికా తన ఆంక్షల ఖడ్గాన్ని రష్యాపై దూసింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించేందుకు వెనకడుగు వేశాయి. అయితే రష్యా మాత్రం ఈ పరిణామాల నుంచి బయటపడటానికి చవక చమురును ఆఫర్ చేస్తూ ముందుకు వచ్చింది. అయితే దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు మోడీ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. రష్యా విక్రయిస్తున్న చవక ముడి చమురును పెద్ద ఎత్తున భారత్ కొనుగోలు చేసింది. తద్వారా దేశీయ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యకు భారత ప్రభుత్వం ముందడుగు వేసింది.
అలాగే సన్ ఫ్లవర్ నూనె ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ లోనే ఉత్పత్తి అవుతుంది. సప్లై చెయిన్ దెబ్బతినడంతో ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుంది. ప్రపంచ డిమాండ్ కు సరిపడా సన్ ఫ్లవర్ ఆయిల్ ను భారత్ సప్లై చేసి చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంది. తద్వారా అదనపు ఆదాయం భారత్ కు చేకూరింది. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది ఫలితంగా అటు రష్యాతోను అమెరికాతోనూ భారత్ చాకచక్యంగా తన వాణిజ్య బంధాన్ని నిలుపుకుంది.
