అంబానీ కుటుంబం జీవనశైలికి ఎప్పుడు గొప్పగా ఉంటుంది, అయితే ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు నీతా అంబానీ, టీనా అంబానీ ఒకరికొకరు చాలా భిన్నంగా ఉంటారు. టీనా అంబానీ మీడియా ప్రపంచానికి దూరంగా ఉండగా నీతా అంబానీ మాత్రం చాలా పాపులర్ అయ్యారు.

వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నపుడు కనిపించడం కూడా చాలా అరుదు.  బాలీవుడ్ నటి అయిన తర్వాత టీనా అంబానీ ప్రపంచానికి ఎందుకు దూరంగా వెళ్లిపోయారో తెలీదు. కానీ టీనా అంబానీ అనిల్ అంబానీని వివాహం చేసుకోగా, నీతా అంబానీ ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్నారు. విళ్లిద్దరూ ధీరూభాయ్ అంబానీ కుమారులు.


వివాహం తరువాత అంబానీ కుటుంబానికి చెందిన ముకేష్, అనిల్ అంబానీ జీవన విధానం బాగా మారిపోయింది. వివాహానికి ముందు టీనా అంబానీ బాలీవుడ్ నటి. నీతా అంబానీ ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు, ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉండేది.

టీనా అంబానీ బాలీవుడ్‌లో 35 కి పైగా సినిమాలు చేసింది. 1975లో, టీనా అంతర్జాతీయ టీన్ ప్రిన్సెస్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అవార్డును కూడా గెలుచుకుంది.

టీనా ఫ్యాషన్ స్టైల్, అందం అనిల్ అంబానీని ఆకర్షించింది. తరువాత ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహం తరువాత, టీనా సినీ ప్రపంచం నుండి దూరమైంది, ఆమె గ్లామర్ ప్రపంచంతో సంబంధాన్ని కూడా కోల్పోయింది.

also read ముకేష్ అంబానీ సంచలన నిర్ణయం.. వారసులకు సమాన బాధ్యతలు.. ...


 నీతా అంబానీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇల్లు నడపడానికి నెలకు 800 రూపాయల వేతనంతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నీతాకు ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం గురించి పూర్తిగా తెలియదు.


ఒకసారి నీతా అంబానీ బిర్లా కుటుంబం కార్యక్రమంలో భరతనాట్యం ప్రదర్శించారు. ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ నీతా అంబానీ నృత్యం బాగా నచ్చి  నీతాను తన ఇంటి కొడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


వివాహం తరువాత నీతా అంబానీ తన ఫ్యాషన్, జీవనశైలిని మార్చడమే కాక, అంబానీ కుటుంబ వ్యాపారాన్ని కూడా చక్కగా నిర్వహించింది. 2010లో ముఖేష్ అంబానీ నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు. నీతా అంబానీ ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్‌ స్థాపకురాలు, చైర్‌పర్సన్. ఆమె ముంబై ఇండియన్స్ టీమ్ యజమాని కూడా.


 నీతా అంబానీ పిల్లలు చాలా పాపులర్ అయ్యారు, అయితే టీనా అంబానీ ఇద్దరు పిల్లలు గురించి అంతగా సమాచారం లేనప్పటికి టీనా అంబానీ కుమారులు జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ. నీతా అంబానీ పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ.