Multi Bagger Stocks అంటే మదుపరులకు లాటరీ టిక్కెట్ల లాంటివే. వీటిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు ఒక్కో సారి అదృష్టం వరించి మిలియనీర్లను చేస్తుంది. అలాంటి స్టాక్స్ గురించి తెలుసుకుందాం. కేవలం ఒక రూపాయి మాత్రమే విలువ చేసే ఈ స్టాక్స్ 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలంలో 5 నుంచి 6 వేల శాతం లాభం అందించాయి.
ప్రపంచ మార్కెట్లలో గందరగోళం నెలకొని ఉన్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ లలో మాత్రం గత రెండేళ్లలో పెద్ద సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లను చూడవచ్చు. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌తో పాటు అనేక పెన్నీ స్టాక్‌లు పెట్టుబడిదారులను మిలియనీర్లను చేశాయి. BSEలో లిస్ట్ అయిన క్రెసాండా సొల్యూషన్స్ (Cressanda solutions share price) వాటిలో ఒకటి. గత ఏడాది కాలంలో కంపెనీ షేరు ధర రూ.0.61 నుంచి రూ.32.15కి పెరిగింది. అంటే, ఈ కాలంలో కంపెనీ స్టాక్ 5200% రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ పెరగడానికి ఒక బలమైన ఆర్డర్ కారణం అని బ్రోకరేజీలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, దాదాపు1500 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌ను కంపెనీ పొందింది. దీంతో ఒక్కసారిగా క్రెసాండా సొల్యూషన్స్ షేర్లకు (Cressanda solutions share price) రెక్కలు తెచ్చిపెట్టింది. ఈ పెన్నీ స్టాక్ వరుసగా 5 సెషన్లలో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
క్రెసాండా సొల్యూషన్స్ షేర్ హిస్టరీ ఏమిటి (Cressanda solutions share price):
గత నెల పనితీరును పరిశీలిస్తే, కంపెనీకి చెందిన ఒక స్టాక్ ధర రూ.44.60 నుంచి రూ.32.15 స్థాయికి దిగజారింది. అంటే, ఈ కాలంలో కంపెనీ స్టాక్ దాదాపు 28% క్షీణించింది. ఇక ఈ స్టాక్ 2022 సంవత్సరం పనితీరు గురించి మాట్లాడినట్లయితే, కంపెనీ షేరు ధర రూ.6.79 నుండి రూ.32.15కి పెరిగింది. అదే సమయంలో, గత 6 నెలల్లో, కంపెనీ స్టాక్ ధరలలో 700% క్షీణత నమోదు చేసింది.
ఏడాది క్రితం ఈ స్టాక్ రూ.0.61గా ఉంది. ప్రస్తుతం రూ.32.15కి పెరిగింది. కంపెనీ స్టాక్ కేవలం ఒక సంవత్సరంలోనే 5200% రాబడిని ఇచ్చింది.
సంవత్సరానికి డబ్బు ఎంత పెరిగింది?
ఒక పెట్టుబడిదారుడు Cressanda solutions share పై నెల క్రితం లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది నేడు రూ.72,000కి పడిపోయి ఉండేది. అదే సమయంలో, ఎవరైనా ఈ స్టాక్ లో 2022 సంవత్సరం ప్రారంభంలో ఒక లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అతనికి ఈ రోజు రూ.4.75 లక్షల రాబడి వచ్చేది. ఇలాగే సరిగ్గా ఏడాది క్రితం అంటే 2021 జూన్ 1 వ తేదీన ఒక లక్ష రూాపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు అది రూ.53 లక్షలకు పెరిగి ఉండేది.
Kaiser Corporation:
ఇక మరో మల్టీ బ్యాగర్ షేర్ గురించి కూడా తెలుసుకుందాం. కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (kaiser corporation share price) ఈ కంపెనీ షేర్లు ఆరు నెలల్లో దాని పెట్టుబడిదారులకు 6000 శాతం పైగా బలమైన రాబడిని అందించాయి. ఈ రోజు కూడా కంపెనీ షేరు పెరుగుదల కొనసాగుతూ 4.99% లాభంతో రూ.75.70 వద్ద ముగిసింది.
6 నెలల క్రితం ధర 97 పైసలు
ఆరు నెలల క్రితం ఈ స్టాక్ ధర (kaiser corporation share price) బిఎస్‌ఇలో 95 పైసలు మాత్రమే. అది ఇప్పుడు రూ. 75 కి పెరిగింది. ఈ కాలంలో, ఈ స్టాక్ 6,142.27% రాబడిని ఇచ్చింది.
కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ ప్రైస్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం, ఆరు నెలల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం నేడు రూ.62.42 లక్షలకు పెరిగి ఉండేది. అదే సమయంలో, ఈ ఏడాది 2022లో ఈ కౌంటర్‌లో ఒక ఇన్వెస్టర్ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పటివరకు రూ.20.73 లక్షల లాభాన్ని ఆర్జించి ఉండేవాడు.
