ఈ 5 కార్లు ట్రాఫిక్‌లో నడపడానికి ఇంకా తక్కువ స్థలంలో ఈజీగా పార్క్ చేయవచ్చు.. ధర కూడా చాలా తక్కువ..
ఆల్టో 800 ఇండియాలోనే అత్యంత చవకైన కారు. ఈ కారుని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ.3 లక్షల 39 వేలతో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్‌తో పాటు కారు ఇతర వేరియంట్‌లలో కూడా అంటే సిఎన్‌జి ఆప్షన్ కూడా ఉంది.
సిటీలో కారు నడపడం చాలా సమస్యాత్మకమైనది. మీకు పెద్ద లేదా పొడవైన కారు ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొంతమంది చిన్న కారులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. మీకు అలాంటి ఐదు కార్ల గురించి మీకోసం. వీటి ధర కూడా చాలా తక్కువ ఇంకా చిన్న సైజ్ కారణంగా సులభంగా ట్రాఫిక్, రద్దీలో ఈజీగా నడపవచ్చు. అంతే కాకుండా తక్కువ స్థలంలో సులభంగా పార్క్ చేయవచ్చు.
మారుతీ ఆల్టో 800
ఆల్టో 800 ఇండియాలోనే అత్యంత చవకైన కారు. ఈ కారుని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ.3 లక్షల 39 వేలతో కొనుగోలు చేయవచ్చు. ట్రాఫిక్ లేదా ఇరుకైన వీధుల్లో ఎక్కడైనా ఈ కారును నడపడం చాలా సులభం. దీని పొడవు 3445 ఎంఎం అయితే వెడల్పు 1515 ఎంఎం. ఆల్టో 800 టర్నింగ్ రేడియస్ కూడా కేవలం 4.6 మీటర్లు మాత్రమే. ఈ కారులో 800 cc పెట్రోల్ ఇంజన్ ను కంపెనీ అందించింది, దీంతో ఈ కారు లీటర్‌కి 22.05 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. సేఫ్టీ కోసం కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ABS అండ్ EBD, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్‌తో పాటు కారు ఇతర వేరియంట్‌లలో కూడా అంటే సిఎన్‌జి ఆప్షన్ కూడా ఉంది.
మారుతీ ఎస్ ప్రెస్సో
మారుతి ఎస్ ప్రెస్సోను సిటీ ట్రాఫిక్‌లో కూడా సాఫీగా నడపవచ్చు. ఎత్తు అండ్ చిన్న కార్లను ఇష్టపడే వారికి ఈ కార్ గొప్ప ఆప్షన్. దీని పొడవు 3565 ఎంఎం మాత్రమే. దీని వెడల్పు 1520 ఎంఎం, ఎత్తు 1567 ఎంఎం. దీని టర్నింగ్ రేడియస్ కూడా 4.5 మీటర్లు మాత్రమే. దీనిలో 998 cc ఇంజిన్ ఉంది, 49 kW అండ్ 89 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. సేఫ్టీ కోసం ABS, EBD, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెంట్రల్ లాక్, ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
డాట్సన్ రెడీ గో
డాట్సన్ రెడీ గో ట్రాఫిక్‌లో నడపడానికి కూడా మంచి కారు. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 3.97 లక్షలు. 800 అండ్ ఒక లీటర్ ఇంజన్ ఆప్షన్ పొందుతుంది. దీనికి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో కూడా వస్తుంది. ABS, EBD, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, బ్యాక్ డోర్ చైల్డ్ సేఫ్టీ లాక్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్, బాడీ కలర్ బంపర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఒక లీటర్ పెట్రోల్‌తో20.71 కి.మీ ప్రయాణిస్తుంది. దీని పొడవు 3435 ఎంఎం మాత్రమే. దీని వెడల్పు 1574 ఎంఎం, టర్నింగ్ ప్రారంభ కూడా 4.7 మీటర్లు మాత్రమే.
హ్యుందాయ్ శాంట్రో
హ్యుందాయ్ శాంట్రో కూడా సిటీలో నడపడానికి చాలా మంచి కారు. దీని పొడవు 3610 ఎంఎం, వెడల్పు 1645 ఎంఎం. ఇందులో 1100 సిసి పెట్రోల్ ఇంజన్ అలాగే సిఎన్‌జి ఆప్షన్ తో కూడా వస్తుంది. దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.41 లక్షలు.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడానికి కూడా గొప్ప ఆప్షన్. ఈ కారుకి 800 సిసి అండ్ ఒక లీటర్ ఇంజన్ ఆప్షన్ ఉన్నాయి. దీనితో పాటు ఈ కారు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. AMTతో కూడిన వన్ లీటర్ ఇంజిన్ లీటరుకు సగటున 22 కిలోమీటర్లు, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు సగటున 22.02 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని పొడవు 3731 ఎంఎం, వెడల్పు 1392 ఎంఎం. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది.