Asianet News TeluguAsianet News Telugu

అమేజాన్ బంపర్ ఆఫర్.. స్లిప్పర్స్ రూ.72వేలు, అదిరిపోయే రివ్యూలు

ఈ చెప్పులు కొనేందుకు నా మారుతి 800 కారు అమ్మేశా. ఎందుకంటే డ్రైవింగ్ చేయడం కంటే నడవడమే మంచిది. ఆరోగ్యం కూడా. డబ్బుకు తగ్గ ఉత్పత్తి’’ అని ఇంకొకరు రివ్యూలో పేర్కొన్నారు

These chappals cost Rs 72k. But the product reviews are priceless
Author
Hyderabad, First Published Oct 30, 2018, 4:39 PM IST

అమేజాన్ లో మొన్నటి దాకా.. దసరా, దీపావళి పండగల సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. అమేజాన్ లో అమ్మకానికి పెట్టిన చెప్పులు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి.

ఈ మధ్య రోగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చెప్పులను విక్రయిస్తున్నారు. డయాబెటిస్, బీపీతో బాధపడుతున్న వారి కోసమంటూ ఇందులోనూ రకాలున్నాయి. సైజు, నాణ్యతను బట్టి వంద రూపాయల నుంచి రెండుమూడు వేల వరకు ఉన్నాయి. అయితే, ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో విక్రయిస్తున్న ‘వెలెంటినో’ కంపెనీ హవాయి చెప్పుల ధర ఏకంగా రూ. 72,225.33. ఇంతా చేస్తే ఇవి ఇంట్లో వాడే బాత్రూం చెప్పులు మాత్రమే. విచిత్రం ఏమిటంటే నిన్నమొన్నటి వరకు వీటి ధర రూ.45,393 మాత్రమే. బహుశా డిమాండ్ పెరిగిందేమో.. ఇప్పుడు ఏకంగా ఏకంగా రూ.27 వేలు పెరిగింది. అది కూడా ఇప్పుడు ఒకే ఒక్క జత అందుబాటులో ఉంది. 

ఈ చెప్పులు కొన్నవాళ్లు.. వాటి నాణ్యత గురించి, వారి అనుభవాలను  రివ్యూలో ఉంచారు. ఈ చెప్పులు కొనేముందు మీరు కూడా ఒకసారి ఈ రివ్యూలు చదవండి

‘‘మా ఆంటీ రికమెండ్ చేయడంతో ఈ చెప్పులు కొన్నా. ఇష్టంగా కొనుక్కున్న బైక్‌ను అమ్మేసి ఈ చెప్పులు కొనుక్కున్నందుకు నాకేం బాధగా లేదు. ఈ థర్డ్ క్లాస్ చెప్పులు అద్భుతంగా ఉన్నాయి. వీటితోనే నా గమ్యస్థానానికి చేరుకుంటున్నాను. బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది. మధుమేహం నార్మల్ అయింది. దయచేసి ఈ చెప్పులు కొనుక్కోండి. ఆరోగ్యంగా ఉండండి. అవసరమైతే నా చెప్పులను రోజుకు రూ.500కు అద్దెకు ఇస్తా’’ అని ఒకరు వ్యంగ్యంగా రివ్యూ రాస్తే..
 
‘‘ఈ చెప్పులు కొనేందుకు నా మారుతి 800 కారు అమ్మేశా. ఎందుకంటే డ్రైవింగ్ చేయడం కంటే నడవడమే మంచిది. ఆరోగ్యం కూడా. డబ్బుకు తగ్గ ఉత్పత్తి’’ అని ఇంకొకరు రివ్యూలో పేర్కొన్నారు. ‘‘చాలా బాగున్నాయి. చాలా అరుదైనవి కూడా. అందుకే బయటకు వేసుకెళ్లడం లేదు. వాటిని తొడుక్కుని నిద్రపోతున్నా. ఆ తర్వాత లాకర్‌లో పెట్టేస్తున్నా’’ అని మరొకరు రాశారు. ‘‘మంచి ప్రొడక్ట్. చాలా చక్కగా ఉన్నాయి. అందుకనే నా కిడ్నీ అమ్మేసి వీటిని కొనుక్కున్నా’’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.

కాగా.. బాత్రూమ్ చెప్పులు ఇంత ధరా అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios