బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు ఏడాది క్రితం నాటి ధరలకు పతనం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పతనం ఇలాగే కొనసాగితే తులం బంగారం రూ. 50 వేలకు దిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు రోజురోజుకీ భారీగా పతనం అవుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారిలో నెమ్మదిగా ఆసక్తి పెరుగుతుంది. ఇన్ని రోజులు బంగారం ధర రికార్డు స్థాయిలో ఉండటంతో చాలామంది బంగారం కొనాలి అంటే భయపడ్డారు కానీ ఇప్పుడు నెమ్మదిగా బంగారం ధర సాధారణ స్థాయికి చేరుకుంటుంది. గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే, బంగారం ధర 24 క్యారెట్ల కుగాను 10 గ్రాముల ధర రూ. 56 వేల దిగువకు చేరుకుంది. అయితే భవిష్యత్తులో బంగారం ధర మరింత పతనం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే బంగారం ధర ఏకంగా 50 వేల రూపాయల దిగువకు పడిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బంగారం ధర అంతర్జాతీయంగా చూసినట్లయితే 1800 డాలర్ల దిగువకు పడుతోంది ఈ పరిణామం చూసినట్లయితే బంగారం ధర రిటైల్ రూపంలో చూసిన భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది
డాలర్ బలం కారణంగా ఈరోజు గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.46 శాతం క్షీణించి ఔన్స్‌కు 1,832.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచంలోని 6 ప్రధాన కరెన్సీలతో US డాలర్ పనితీరును చూపే US డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 0.13 శాతం పెరిగింది.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో అంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), బెంచ్‌మార్క్ గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఈరోజు 10 గ్రాములకు రూ. 56,191 వద్ద ప్రారంభమైంది, దాని మునుపటి ముగింపు ధర రూ. 56,213తో పోలిస్తే తగ్గింది. 56,191 మరియు 56,032 రేంజ్‌లో ట్రేడింగ్ తర్వాత, 10 గ్రాములకు రూ.159 లేదా 0.28 శాతం తగ్గి రూ.56,054కి చేరుకుంది.
ఇదిలా ఉంటే బంగారం ధర దేశీయంగా కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బంగారం ధర 56 వేల దిగువన ట్రేడ్ అవుతోంది అయితే ఇదే ట్రెండు కొనసాగితే బంగారం ధర 50000 దిగువకు సైతం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బంగారం ధర భారీగా తగ్గడం వెనుక, డాలర్ బలం పుంజుకోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ బాగా తగ్గింది. ఇది కూడా ఒక కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఎంత ధర తగ్గితే అంతలా రిటైల్ రూపంలో సేల్స్ బాగా జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి బంగారం 50 వేల దిగువకు ఎప్పుడు తగ్గుతుందా అని కస్టమర్లు ఎదురుచూస్తున్నారు.
