నేడు బుధవారం రోజున స్టాక్ మార్కెట్ మళ్లీ గ్రీన్ మార్క్ మీద ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 302.01 పాయింట్లు (0.68 శాతం) పెరిగి 44825.03 రికార్డు స్థాయిలో ప్రారంభమైంది.

అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 13143 వద్ద 87.80 పాయింట్ల (0.67 శాతం) లాభంతో ప్రారంభమైంది. అంతకుముందు మంగళవారం రోజున సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ముగిసింది, నిఫ్టీ మొదటిసారి 13000 కి చేరుకుంది. 

మంగళవారం రోజున యు.ఎస్ మార్కెట్ డౌ జోన్స్ ఇండెక్స్ 1.54 శాతం పెరిగి 454.97 పాయింట్లతో 30,046.20 వద్ద ముగిసింది. ఇండెక్స్ ఈ స్థాయిలో మొదటిసారి ముగిసింది. నాస్‌డాక్ ఇండెక్స్ కూడా 1.31 శాతం పెరిగి 12,036.80 వద్ద ముగిసింది.

ఎస్ అండ్ పి 500 సూచీ 57.82 పాయింట్లు పెరిగి 3,635.41 వద్ద ఉంది. యూరోపియన్ మార్కెట్ కూడా అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ సూచీ 1.55 శాతం పెరిగి 6,432.17 వద్ద ఉంది. జర్మనీకి చెందిన డాక్స్ ఇండెక్స్ 165.47 పాయింట్లు పెరిగి 13,292.40 వద్ద ఉంది.

ఫ్రాన్స్‌కు చెందిన సిఎసి సూచీ కూడా 1.21 శాతం పెరిగి 5,558.42 వద్ద ముగిసింది. నేడు, ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ ఇండెక్స్ 395 పాయింట్లుతో 1.51 శాతం పెరిగి 26,561 వద్ద ట్రేడవుతోంది. హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 375 పాయింట్ల లాభంతో 26,963 వద్ద ట్రేడవుతోంది.

also read కేవలం ఒక్క ఎస్‌ఎం‌ఎస్ లేదా మిస్డ్ కాల్‌తో మీ పి‌ఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే ? ...

మరోవైపు, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.22 శాతం తగ్గి 3,395 వద్ద ట్రేడవుతోంది. గత వారం బిఎస్ఇ సెన్సెక్స్ 439.25 పాయింట్లతో 1.01 శాతం లాభపడింది. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మార్కెట్ అస్థిరత మరింత కొనసాగుతుంది, అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. 

 నేడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ ప్రారంభంలో వేగంగా ఊపందుకున్నాయి. నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, మారుతి, గెయిల్, హిండాల్కో షేర్లు రెడ్ మార్క్ వద్ద ప్రారంభమయ్యాయి.

 నేడు అన్ని రంగాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. వీటిలో ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, ఐటి, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంకులు, లోహాలు, మీడియా ఉన్నాయి.

సెన్సెక్స్ 44664.18 వద్ద ఉంది, ప్రీ-ఓపెన్ సమయంలో ఉదయం 9.01 గంటలకు 141.16 పాయింట్లతో  0.32 శాతం లాభపడింది. నిఫ్టీ 13115.30 స్థాయిలో 60.10 పాయింట్లతో  0.46 శాతం పెరిగింది.

స్టాక్ మార్కెట్ గత ట్రేడింగ్ రోజున గొప్ప విజృంభణతో సెన్సెక్స్ 445,87 పాయింట్లతో 44523,02 వద్ద ముగిసింది అంటే 1.01 శాతం లాభపడింది. అలాగే నిఫ్టీ 1.00 శాతం 128.70 పాయింట్ల లాభంతో 13055.15 స్థాయిలో ముగిసింది.

స్టాక్ మార్కెట్ మంగళవారం గ్రీన్ మార్క్ మీద ఓపెన్ అవగా సెన్సెక్స్ 44351.82 స్థాయిలో 274.67 పాయింట్లతో, నిఫ్టీ 13010 వద్ద 83.50 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.