Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ పై ఆర్‌బి‌ఐ ప్రకటనల ప్రభావం.. నేడు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు వారం చివరి రోజున  నష్టాలతో ముగిసాయి.ముఖ్యంగా ఆర్‌బీఐ పాలసీ రివ్యూ తరువాత కీలక సూచీలు నష్టాల్లోకి వెళ్ళాయి.

stock market : sensex nifty share market close today latest news 4 june 2021 closing indian benchmark ended low
Author
Hyderabad, First Published Jun 4, 2021, 5:43 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేడు ఉదయం ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌పై వీటి ప్రభావం పడింది.

స్టాక్ మార్కెట్ ఈ వారం చివరి రోజున శుక్రవారం నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ  ఇండెక్స్ సెన్సెక్స్ 132.38 పాయింట్లతో 0.25 శాతం క్షీణించి 52,100.05 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 20.10 పాయింట్లతో 0.13 శాతం తగ్గి 15,670.25 వద్ద ముగిసింది. గత వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 882.40 పాయింట్లతో 1.74 శాతం లాభపడింది. గత ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్-నిఫ్టీ రికార్డు స్థాయిలో ముగిసింది.  

ఆర్‌బి‌ఐ చేసిన ముఖ్యమైన ప్రకటనలు
ఎప్పటిలాగే రెపో రేటులో ఆర్‌బిఐ ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు కూడా 4.25 శాతంగా ఉంది. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య వైఖరిని 'మితంగా' ఉంచింది. కరోనా వైరస్ మహమ్మారి, పిఎంఐ డేటా, కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో కంపెనీలు పనిచేసే విధానం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జి‌డి‌పి వృద్ధి రేటు   9.5 శాతం అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండే అవకాశం ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 5 రోజుల్లో 30 శాతం పెరిగాయి
 గౌతమ్ అదానీ ఆసియా, భారతదేశపు రెండవ అతిపెద్ద ధనవంతుడికి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు శుక్రవారం వరుసగా 5 రోజు పెరిగాయి. నేడు 7.43 శాతం పెరిగి 1701.20 రూపాయలకు చేరుకుంది. దీంతో అదానీ గ్రూప్ చెందిన  అదానీ ఎంటర్ప్రైజెస్ రెండవ అత్యంత విలువైన సంస్థగా మారింది. ఈ వారంలో వీటి  స్టాక్ 30 శాతానికి పైగా పెరిగింది.

also read జీతాలు పొందే వారికి, పెన్షనర్లకు ఆర్‌బి‌ఐ గుడ్ న్యూస్.. ఎన్‌ఏ‌సి‌హెచ్ లభ్యతపై కీలక ప్రకటన ...

 హెవీవెయిట్‌లలో ఎక్కువ భాగం నేడు ఒఎన్‌జిసి, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ లాభాలతో ముగిసాయి. మరోవైపు నెస్లే ఇండియా, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్ నష్టాలతో ముగిశాయి. 

 నేడు బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్, ఫార్మా, పిఎస్‌యు బ్యాంకులు, ఎఫ్‌ఎంసిజి మరియు ప్రైవేట్ బ్యాంకులు నష్టాల మీద మూగిశాయి. కాగా ఐటి, మీడియా, రియాల్టీ, మెటల్ మరియు ఆటో లాభాలతో మూగిసాయి. 

దేశంలోని టాప్ 10 కంపెనీలలో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంతో  కలిపి రూ.1,39,566.52 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్ ఇందులో అత్యధిక లాభాలను ఆర్జించాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్ అనే రెండు కంపెనీలు మాత్రమే మార్కెట్ క్యాపిటలైజేషన్లో క్షీణతను చూశాయి. 

స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్  ఓపెన్ 
 ప్రారంభంలో సెన్సెక్స్ 5.01 పాయింట్లు అంటే 0.01 శాతం పెరిగింది. నిఫ్టీ 0.6 పాయింట్ల (0.01 శాతం) లాభంతో 15691.30 స్థాయిలో ప్రారంభమైంది.

గురువారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ 
గురువారం సెన్సెక్స్-నిఫ్టీ  అస్థిరత తరువాత లాభాలతో మూగిసింది. 382.95 పాయింట్ల (0.74 శాతం) లాభంతో సెన్సెక్స్ 52,232.43 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 114.15 పాయింట్లు (0.73 శాతం )పెరిగి 15,690.35 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios