కరోనా వైరస్ వ్యాక్సిన్ సంక్రమణను నివారించడంలో ఫైజర్‌ ఇంక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90% కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని ప్రకటించిన తరువాత ఔషధ తయారీ సంస్థ  ఫైజర్ షేర్ ధర ఇంట్రాడేలో భారీగా పెరిగింది.

అంతకుముందు ఈ వాటా 52 వారాల గరిష్ట స్థాయికి తాకింది. ఫైజర్ టీకా డేటాను ముందస్తుగా చూస్తే కోవిడ్-19ను నివారించడంలో 90% ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తున్నాయి.

కొన్ని వారాల క్రితం గరిష్టంగా 5,239 రూపాయలను నమోదు చేసిన తరువాత, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలో  నేడు భారీ రికార్డు స్థాయిలో ఫైజర్ షేర్ ధర 5,315 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

also read  మోడల్స్‌ తో ఫొటోషూట్‌ లేకుండానే ఫోటోలు.. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసిన ఐఐటీ విద్యార్థులు.. ...

ఈ సంవత్సరంలో గరిష్ట స్థాయికి ఫైజర్ షేర్ తాకాయి. కోవిడ్‌-19 అరికట్టేందుకు వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు తాజాగా యూకే ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఎంహెచ్‌ఆర్‌ఏ మద్దతివ్వడంతో యూకే ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందించిన వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్‌ దరఖాస్తు చేసింది.

అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.