రూ.999కే విమాన టికెట్...!

SpiceJet Offers Flight Tickets From Rs. 999. Additional Benefits Also Available
Highlights

*మరోసారి ఆఫర్ల వర్షం కురిపిస్తున్న స్పైస్ జెట్
*మాన్ సూన్ సేల్ ప్రకటించిన స్పైస్ జెట్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ‘ మెగా మాన్ సూన్ సేల్’ పేరిట ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ లో భాగంగా డొమెస్టిక్( దేశీయ) విమానాల  టిక్కెట్లను రూ.999కే అందిస్తున్నట్టు పేర్కొంది. స్పైస్‌జెట్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రమోషనల్‌ సేల్‌ 2018 జూలై 8 వరకు వ్యాలిడిటీ ఉంటుందని  స్పైస్‌జెట్‌ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 

2018 అక్టోబర్‌ 8వ తేదీకి ఈ ఆఫర్‌ ప్రయాణ కాలం ముగియనుంది. తక్కువ ధరకు టిక్కెట్లను అందించడమే కాకుండా.. ఎయిర్‌లైన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. సీట్లు, మీల్స్‌, స్పైస్‌మ్యాక్స్‌, ఇతర యాడ్‌-ఆన్స్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ఈ క్యారియర్‌ అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రోమో కోడ్‌ ఏడీడీ0ఎన్‌20గా స్పైస్‌జెట్‌ వెల్లడించింది.

ఈ ఆఫర్ తోపాటు కొన్ని కండిషన్స్ కూడా స్పైస్ జెట్ పేర్కొంది. ఆ కండిషన్స్ ప్రకారం.. వన్‌-వే ధరలకు మాత్రమే ఈ మెగా సేల్‌ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను మిగతా ఏ ఆఫర్‌తో కలుపరు. గ్రూప్‌ బుకింగ్స్‌కు ఇది వర్తించదు. ఒకవేళ అవసరమైతే స్వల్ప రద్దు  ఛార్జీలతో టిక్కెట్‌ ధర మొత్తాన్ని రీఫండ్‌ చేయనుంది. ఫస్ట్‌-కమ్‌, ఫస్ట్‌-సర్వ్‌డ్‌ బేసిస్‌లోనే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. విమానం బయలుదేరే సమయం, ఇతర షెడ్యూల్స్‌ రెగ్యులేటరీ ఆమోదం మేరకే ఉంటాయి. ఈ ఆఫర్‌కు బ్లాక్‌-అవుట్‌ డేట్స్‌ వర్తిస్తాయి.
 

loader