ప్రముఖ మసాలా బ్రాండ్ ఎండిహెచ్ యజమాని మహాశయ్ ధరంపాల్ గులాటి గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. కొన్ని నివేదికల ప్రకారం మహాశయ్ ధరంపాల్ గులాటి గత మూడు వారాలుగా ఢీల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు  రావటంతో తెల్లవారు జామున 5:38 గంటలకు తుది శ్వాస విడిచారు. ధరంపాల్ గులాటి కొంతకాలం క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే చికిత్స తరువాత కరోనా నుండి కోలుకున్నారు. గతేడాది ఆయనకు పద్మ భూషణ్ అవార్డు కూడా లభించింది.

1947లో శరణార్థి శిబిరంలో నివసించిన 'దాద్జీ', 'మసాలా కింగ్', 'కింగ్ ఆఫ్ స్పైసెస్', 'మహాషాజీ' అని పిలువబడే మహాశయ్ ధరంపాల్ గులాటి 1923 లో పాకిస్తాన్లోని సియాల్‌కోట్‌లో జన్మించారు.

also read ఉదయం లేవగానే జిమ్, 19వ అంతస్తులో అల్పాహారం.. ఇది అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ దినచర్య.. ...

నాలుగో తరగతితోనే చదువు మానేసిన ధరంపాల్ గులాటి స్కూల్ వెళ్ళే రోజుల్లోనే తన తండ్రి మసాలా వ్యాపారంలో పాలుపంచుకునేవాడు. 1947లో ధరంపాల్ గులాటి భారతదేశానికి వలస వచ్చి అమృత్సర్‌లోని శరణార్థి శిబిరంలో బస చేశారు. 

తరువాత ఢీల్లీకి వెళ్లి ఢీల్లీలోని కరోల్ బాగ్లో ఒక దుకాణాన్ని ప్రారంభించాడు. ధరంపాల్ గులాటి ఎం‌డి‌హెచ్ సంస్థను అధికారికంగా 1959లో స్థాపించారు. ఈ వ్యాపారం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఎం‌డి‌హెచ్ సంస్థ ధరంపాల్ గులాటిని భారతీయ సుగంధ మసాలా పంపిణీదారీ, ఎగుమతిదారి చేసింది.

ధరంపాల్ గులాటి ఎం‌డి‌హెచ్ సంస్థ బ్రిటన్, యూరప్, యుఎఇ, కెనడా మొదలైన ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు భారతీయ సుగంధ మసాలాను ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం ఎండీహెచ్ 62 రకాల మసాలాలను ఉత్పత్తి చేస్తోంది. 2019లో భారత ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పౌర గౌరవమైన పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.

ఎండిహెచ్ మసాలా ప్రకారం  దానధర్మాల్లోనే గులాటీ ఎప్పుడూ ముందుంటారు. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఆలోచనతో  ధరంపాల్ గులాటి తన జీతంలో 90 శాతం విరాళం ఇచ్చేవాడట.