మీ బండిలో పెట్రోల్ ఆవిరైపోతోందా? ఈ టెక్నిక్ పాటించి మైలేజ్ పెంచుకోండి
సాధారణంగా మన బండిలో మైలేజ్ పెంచుకోవడానికి మనం చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తాం. తరచూ సర్వీసింగ్ చేయిస్తాం. ఆయిల్ ఛేంజ్ చేయిస్తాం. గాలి పట్టిస్తాం.. ఇలా ఎన్నో చేస్తాం. అయితే మీ పెట్రోల్ ట్యాంకులోపల ఉన్న పెట్రోల్ మీకు తెలియకుండా ఆవిరవుతుందని తెలుసా.. అది ఎలాగో తెలుసుకుందాం రండి..
బండి కొనేటప్పుడు ఎన్నో ఆలోచిస్తాం. ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంత, ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి, మైలేజ్, సేఫ్టీ మిజర్మెంట్స్.. ఇలా ఎన్నో ఆలోచిస్తాం. కొన్న తర్వాత మాత్రం కండిషన్స్ ప్రకారం వాహనం నడపం. అందువల్లనే చాలా తర్వగా బండి దెబ్బతింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే బండి కొనేటప్పుడు కంపెనీ ఇచ్చిన ఇన్స్‌స్ట్రక్షన్స్ కచ్చితంగా పాటించాలి.
ఇవి కూడా ముఖ్యమే..
అలాంటి వాటిలో కొన్ని కండీషన్స్ ఏంటంటే.. టైర్లలో సరిపడా గాలి పట్టించాలి. ప్రతి 2000 కి.మీ. ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఇంజిన్ దెబ్బతినకుండా ఉండాలంటే తక్కువ వేగంతో బండి నడపాలి. అతివేగంగా నడపడం వల్ల వాహనంలోని అన్ని పార్టులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తరచూ సర్వీసింగ్ చేయించాలి.
పెట్రోల్ ఆవిరవ్వడమేంటి..
సాధారణంగా బండి ట్యాంకు చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తారు. ఇది సాధారణంగా స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. అందువల్ల ట్యాంక్ లోపల పెట్రోల్ నిల్వ ఉంటుంది. ట్యాంక్‌ను తయారు చేసిన తర్వాత లీకేజీ టెస్ట్ చేస్తారు. వెల్డింగ్, లీకేజ్ టెస్టింగ్ తర్వాత ట్యాంక్‌ను పెయింట్ చేస్తారు.
పెట్రోల్ ఆవిరవకుండా ఉండాలంటే..
ఫ్యూయల్ ట్యాంక్ ఎంత స్ట్రాంగ్ గా చేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల అది దెబ్బతింటుంది. ముఖ్యంగా వేసవి సమయంలో ఉష్ణోగ్రతల వల్ల ఎండలో ఉన్న బండ్లు వేడెక్కిపోతాయి. ఇనుముతో చేసిన ఫ్యూయల్ ట్యాంకులు కూడా ఎండ ధాటికి వేడెక్కుతాయి. ఆ సమయంలో లోపల ఉన్న పెట్రోల్ కంటికి కనిపించకుండానే ఆవిరవుతుంది. అందువల్లనే ఎండాకాలంలో మైలేజీ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. పెట్రోల్ ట్యాంకును ఏదైనా క్లాత్‌తో గాని, దలసరి షీట్‌తో కాని కప్పాలి. ఇది పెట్రోల్ ఆవిరవ్వకుండా చేస్తుంది.